ఆచితూచి అడుగులేస్తున్న న‌వీన్ పోలిశెట్టి.. ఎవ్వ‌రికీ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌ట్లేదుగా..!

-

ట్యాలెంట్ ఉంటే ఎవ‌రి స‌పోర్టు లేకున్నా ఎద‌గొచ్చ‌ని ఇప్ప‌టికే చాలా మంది నిరూపించారు. మెగాస్టార్ నుంచి మొన్న వ‌చ్చిన విజ‌య్ దేవ‌రకొండ దాకా ఇలాంటి వారే. ఇదే కోవ‌లోకి వ‌స్తున్న న‌టుడు నవీన్ పొలిశెట్టి. ఈ త‌రం యంగ్ జనరేషన్స్ కు ఇన్‌స్పిరేష‌న్‌గా నిలుస్తున్నాడు. ఈ యువ హీరో జాతిరత్నాలు సినిమాతో ఏ స్థాయిలో సంచ‌ల‌నం క్రియేట్ చేశాడో చెప్పనవసరం లేదు. ఈ హిట్ తో నవీన్ కు గ్యాప్ లేకుండా సినిమాఆఫర్స్ వస్తున్నాయట.

వైజయంతి ప్రొడక్షన్ లోని స్వప్న సినిమాస్ లో తెరకెక్కిన జాతిరత్నాలు సినిమాను మహానటి మూవీ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ నిర్మించాడు. పిట్టగోడతో డిజాస్టర్ అందుకున్న డైరెక్ట‌ర్ అనుదీప్.. జాతిర‌త్నాలు సినిమాను మాత్రం సూప‌ర్ హిట్‌చేశాడు. త‌న‌దైన కామెడీ మార్కును చూపించాడు. రూ.7కోట్ల లోపు చిన్న బడ్జెట్ సినిమాగా వ‌చ్చిన జాతిర‌త్నాలు.. ఏకంగా రూ.50కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. దీంతో నిర్మాతకు భారీ స్థాయిలో లాభాలు వ‌చ్చాయి. సినిమా హిట్టవ్వడంతో డైరెక్ట‌ర్ అనుదీప్ కు కూడా ఆఫర్స్ వ‌స్తున్నాయి.

జాతిరత్నాలు హిట్టయిన తరువాత న‌వీన్‌కు ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. మ‌రీ ముఖ్యంగా దిల్ రాజు, హీరో మహేష్ బాబు లాంటి వారు కూడా ఫోన్ చేసి వాళ్ల‌ ప్రొడక్షన్స్‌ లో చేయ‌మ‌న్నార‌ని స‌మాచారం. కానీ నవీన్ మాత్రం త‌న‌కు న‌చ్చిన క‌థ సెట్ అయ్యే వరకూ ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వ‌ట్లేదంట‌. ఇప్ప‌టికే 20కి పైగా క‌థ‌ల‌ను రిజెక్ట్

చేశాడంట‌. కాక‌పోతే రెండు కథలపై ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయ‌ని తెలుస్తోంది. చూడాలి మ‌రి ఈ జాతిర‌త్నం ఎలాంటి సినిమాతో వ‌స్తాడో.

Read more RELATED
Recommended to you

Latest news