పాకిస్తాన్ కొత్త ప్రధాని మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆగష్టు 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ వేడుకకి సార్క్ దేశాల అధినేతలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించారు. అంతేకాకుండా తాను క్రికెట్ ఆడే సమయంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ప్రముఖ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూలను
ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానం గురించి మాజీ క్రికెటర్ నవ్యజోత్ సిద్ధూ స్పందించారు. టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇమ్రాన్ పంపిన ఆహ్వానాన్ని గొప్ప గౌరవంగా భావిస్తాను, ఆహ్వానాన్ని స్వీకరిస్తున్నట్లు సిద్దూ తెలిపారు. ఇమ్రాన్ ఓ జీనియస్ అని, అతని క్యారక్టర్‌పై తనకు నమ్మకం ఉందని సిద్దూ అన్నారు. ప్రజలను ఐక్యం చేసే సత్తా, స్నేహ వారధులను నిర్మించే సామర్థ్యం క్రీడాకారులకు ఉంటుందని ఈ సందర్భంగా సిద్దూ తెలిపారు. ఓ సాధారణ టీమ్‌తో 1992లో ఇమ్రాన్ పాకిస్థాన్‌కు ప్రపంచకప్‌ను అందించారని సిద్దూ గుర్తు చేశారు.
ఇస్లామాబాద్‌లోని రాష్ట్రపతి భవన్‌లో ఇమ్రాన్ ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి మమ్మూన్ హుస్సేన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు.