Samantha: సమంత‌ను కౌగలించుకుని ఎమోషనల్ అయిన నయనతార..లవ్ యూ చెప్పిన విఘ్నేశ్ శివన్

-

బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత ప్రజెంట్ వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇటీవల ‘కాతు వాకుల రెండు కాదల్, శాకుంతలం’ ఫిల్మ్స్ షూట్ కంప్లీట్ చేసింది. ఈ క్రమంలోనే ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్రాన్ని సమంత, నయనతార స్పెషల్ షో వేసుకుని చూసినట్లయింది. ఇక ఈ పిక్చర్ చూసిన లేడీ సూపర్ స్టార్ నయనతార ఎమోషనల్ అయి..అలానే సమంతను కౌగలించుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది.

‘కణ్మణి, ఖతిజ’ అనే క్యాప్షన్ తో ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే సినిమా పేరుతో వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, నెటిజన్లు వీడియోను రీ ట్వీట్ చేస్తున్నారు. అలా ఆ వీడియో తెగ వైరలవుతోంది. దీనిని నయనతార బాయ్ ఫ్రెండ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ ‘లవ్ యూ ’ అని మీనింగ్ వచ్చేలా సింబల్స్ పెట్టి రీ ట్వీట్ చేశారు. ‘కాతు వాకుల రెండు కాదల్’ చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ఇందులో హీరోగా కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి నటించారు.

విఘ్నే శ్ శివన్ దర్శకత్వంలో గతంలో విజయ్ సేతుపతి, నయనతార కలిసి జంటగా ‘నానుమ్ రౌడీదాన్’ పిక్చర్ చేశారు. ఇది బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. ప్రస్తుతం ట్రై యాంగిల్ లవ్ స్టోరి ‘కాతు వాకుల రెండు కాదల్’ చేశారు. ఈ సినిమాపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. సినిమా డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి యంగ్ అండ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్. కాగా, చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news