నేను అందుకే ప్రేమ వదిలేసా; నయనతార కామెంట్స్…!

-

వయసు మీద పడుతున్నా సరే వరుసగా తమిళంలో సినిమాలు చేయడమే కాకుండా… తెలుగులో కూడా సినిమాలు చెయ్యాలి అని చూస్తుంది సీనియర్ హీరోయిన్ నయనతార. ఇక మూడు పదుల వయసు దాటినా సరే ఆమెకు మాత్రం క్రేజ్ తగ్గడం లేదు. చీర కట్టు అయినా డ్రెస్… అయినా సరే ఆమె మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటూమే ఉంది. తమిళంలో ఇప్పుడు నయన తారకి మంచి డిమాండ్ ఉంది.

ఇక ఆమె ఈ మధ్య బికినీలు వేయడానికి కూడా సిద్దంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆమె పారితోషికం కూడా అక్కడ భారీగానే తీసుకుంటుంది. ఆమె అడిగినంత ఇవ్వడానికి అక్కడ రెడీ అవుతున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఆమె తన ప్రేమ వ్యవహారాల గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. నమ్మకం లేని చోట ప్రేమ నిలవదని ఆమె చెప్పుకొచ్చింది. రెండుసార్లు నా ప్రేమ విఫలం కావడానికి కారణం అదే అని చెప్పింది.

నమ్మకం లేకుండా కలిసి జీవించడం కన్నా విడిపోవడమే మంచిదని వారితో నా బంధాన్ని వదులుకున్నా అని చెప్పుకుంది. ఆ సమయంలో నేను ఎంత బాధను అనుభవించానో నాకు మాత్రమే తెలుసన్న ఆమె… ఆ సమయంలో నేను పెదవి విప్పకపోయినా ఎవరికి తోచింది వారు అనుకున్నారని… రాసుకున్నారని మీడియా మీద ఫైర్ అయింది. అయినా సరే నేను మాట్లాడలేదని… ఆ బాధ నుంచి బయటకు రావడానికి నాకు చాలా కాలమే పట్టిందన్న ఆమె… సినిమాలే నన్ను తిరిగి మనిషిని చేశాయని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news