భీమ శoకర జ్యోతిర్లింగ క్షేత్ర విశేషాలు….!

-

మన దేశంలో హిందూ సంప్రదాయం ప్రకారం సృష్టిని నడిపించువాడు శివుడు అని విశ్వసిస్తారు. అంత మహిమ గలవాడు కనుక అడుగడుగునా మన దేశంలో శైవ క్షేత్రాలు ఎన్నో వెలిశాయి. వాటిలో ప్రసిద్ధమైనవి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు. ప్రతి ఒక్క హిందువు తన జీవితంలో ఈ జ్యోతిర్లింగ క్షేత్రాలను ఒక్కసారైనా దర్శించాలని కోరుకుంటారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒక్కో క్షేత్రానికి ఒక్కో విశిష్టత ఉంది. వాటిలో ఒకటి భీమ శoకర జ్యోతిర్లింగ క్షేత్రం.

మహారాష్ట్రలో పూణే కి 127 కి.మీ దూరం లో ఖేడ్ తాలుకాలో భీమా నది పక్కన భావగిరి గ్రామంలో భీమశంకర జ్యోతిర్లింగం ఉంది. భీముడు అనే రాక్షసుడు వల్ల తలెత్తిన విపత్తును తొలగించినందు వల్ల ఇక్కడ శంకరుడుకి భీమ శంకరుడు అని పేరు వచ్చింది. సహ్యాద్రి పర్వత ప్రాంతంలో ఈ క్షేత్రం ఉంది. కృష్ణా నదికి ఉపనది అయిన భీమా నది పుట్టిన చోటు శివలింగం పక్కన ప్రవహిస్తుంది. భీమ శంకరుడు ని శాకిని, డాకిని అనే రాక్షసులు పూజిస్తారని పురాణ కథనం. ఈ ఆలయాన్ని 13 వ శతాబ్దం లో నిర్మించినట్టు ఆధారాలు ఉన్నాయి.

పచ్చని చెట్ల మద్య కొండ కోనల నడుమ ఈ ప్రాంతంలో ఈ ఆలయం ప్రకృతి రమణీయతను చూడటానికి పర్యాటకులకు ఉల్లాసాన్ని కలుగ చేస్తుంది. ఇంకా దగ్గరలో ఉన్న త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, పర్వత ప్రాంతాల్లో ఉండే వన్య ప్రాణులు చూపరులను ఆకర్షిస్తుంది. ఇంకా ఇక్కడ టేక్కింగ్ కు అనుకూలంగా ఉండటం వల్ల ఎప్పుడు ఇక్కడ రద్దీగా ఉంటుంది. అయితే ఈ ఆలయాన్ని ఇక్కడ ప్రకృతి సోయగాలను చూడాలంటే ఆగస్ట్, ఫిబ్రవరి నెలల్లోనే సాధ్యం. మిగతా రోజుల్లో ఇక్కడ ప్రయాణం అత్యంత క్లిష్టమైనది.

Read more RELATED
Recommended to you

Latest news