NBK107: టీజర్ విడుదల.. సింహం వేట మొదలైంది!

‘అఖండ’ సినిమా సక్సెస్‌తో హీరో నందమూరి బాలకృష్ణకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమా భారీ సక్సెస్ అందుకోవడంతో.. తనతోపాటు తన అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా తర్వాత అభిమానులు తన తర్వాతి చిత్రం కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. తెలుగు కమర్షియల్ డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపిచంద్ మలినేనితో బాలయ్య నెక్ట్స్ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్‌బీకే 107 వర్కింగ్ టైటిల్‌గా ఫిక్స్ చేశారు.

హీరో బాలకృష్ణ
హీరో బాలకృష్ణ

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా, తాజాగా సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌ను చూస్తుంటే పక్కా మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా కనిపిస్తోంది. టీజర్ మొత్తంలో మూడు డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగులు బాలయ్య రేంజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయి. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్‌ గా ఉంది. బాలయ్య చెప్పిన డైలాగులు.. ‘మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డన్, భయం నా బయోడెటాలోనే లేదు. నరకడం మొదలు పెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలు కూడా గుర్తు పట్టలేరు’ అని చెప్పిన డైలాగులు ఎంతో అలరిస్తున్నాయి. వీడియో మొత్తానికి ఒక యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా కనిపిస్తోంది.