అడవులు నరికి నగరంగా మార్చడం తో జంతువులు అన్నీ కూడా ఇళ్ళల్లోకి వస్తున్న సంఘటనలు ఈ మధ్య చూస్తున్నారు. కోతులు ఒక్కొసారి మూకుమ్మడిగా దాడులు చేస్తుంటాయి. కొన్ని సార్లు వాటిల్లో అవే పొట్లాడుకుంటాయి. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలవుతాయి.కొన్ని సార్లు అవి ఏదైన అనుకొని ప్రమాదాల బారిన కూడా పడుతుంటాయి. అయితే, ఇక్కకో కోతి తీవ్రంగా గాయపడింది.
ఓ కోతికి చెప్పుకోలేని బాధ వచ్చి పడింది..ఆ కోతికి తీవ్రమైన గాయం తగలడం తో నొప్పిని భరించ లేక పోయింది. అయినా, తన తల్లి ప్రేమను మాత్రం మరువలేదు..ఒక చేతిలో తన బిడ్డను మొస్తూ తన నొప్పిని భరించింది..తల్లి ప్రేమను చూపించింది..ఆ గాయం కు చికిత్స చేయించుకోవడం కోసం ఆసుపత్రి ముందుకు వచ్చి ధీనంగా కూర్చుంది.అందుకు సంభందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది..
ఈ ఘటన బీహార్ లో వెలుగు చూసింది..తన బిడ్డనేస్కోని షాజామా ప్రాంతంలోని ఆస్పత్రి ముందు వెళ్లి కూర్చుంది. అక్కడి వారివైను బాధతో, దీనంగా చూసింది. అక్కడ కోతిని చూసిన వారు మొదట్లో చాలా భయపడ్డారు. కానీ అక్కడి డాక్టర్ అహ్మద్ కోతి గాయమైనట్లు గమనించాడు. మెల్లగా దాని దగ్గరకు వెళ్లారు. ఆ తర్వాత దాన్ని క్లినిక్ లోపలికి తీసుకెళ్లి సపర్యలు చేశారు. కోతి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కల్గించలేదు..ఆ గాయానికి మందు రాయించుకొని కొద్ది సేపు ఉండి అక్కడి నుంచి వెళ్ళి పోయింది.ఈ దృశ్యాన్ని చూడటానికి జనాలు అక్కడ వచ్చారు.ఆ క్రమంలో తీసిన వీడియోనే ఇప్పుడు నెట్టింట చక్కర్లు కోడుతుంది..
बिहार के सासाराम में आज एक बंदर अपने घायल बच्चे को लेकर एक डॉक्टर के क्लिनिक में पहुँच गया और इलाज कराने के बाद वहाँ से निकला @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/kI7LIpvQw5
— manish (@manishndtv) June 8, 2022