హత్రాస్ లాంటి ఘటనలని మహారాష్ట్రలో అస్సలు సహించబోమని, నిందితులకి వెంటనే శిక్షపడేలా చేస్తామని, ఇలాంటి విషయాల్లో అస్సలు ఆలస్యం చేయమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యాలు చేసారు. 19ఏళ్ల దళిత అమ్మాయిని నలుగురు అగ్ర కులస్తులు కలిసి సామూహిక అత్యాచారం చేయడం, ఆ తర్వాత బాధితురాలు చికిత్స పొందుతూ చనిపోవడం సంచలనమైన సంగతి తెలిసిందే.
ఈ విషయాలని ఉటంకిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, మా రాష్ట్రంలో అలాంటి పరిస్థితిని సహించమని, అదే కాదు ఆడవాళ్ళపై ఏది జరిగినా చాలా సీరియస్ గా తీసుకుంటామని, ఈవ్ టీజింగ్, అనవసరంగా బాధించడం మొదలగు వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేసాడు. పోలీసులు ప్రజల రక్షణ కొరకే ఉన్నారన్న విషయాన్ని ప్రజలకి తెలియజేసేలా ప్రవర్తిస్తామని అన్నాడు. ప్రస్తుతం ఈ అత్యాచార నిందితులు నలుగురు పోలీసుల అదుపులోనే ఉన్నారు. బాధితురాలి కుటుంబంతో మాట్లాడిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి న్యాయం చేస్తానని మాటిచ్చాడు.