లైసెన్స్ కోసం RTO ఆఫీసుకి వెళ్ళక్కర్లేదు… డ్రైవింగ్ టెస్ట్ కూడా ఆన్లైన్ లోనే…!

-

ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి మీరు ఆర్టిఓ ఆఫీస్ కి వెళ్ళక్కర్లేదు. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ లోనే చేసుకోవచ్చు. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ కొత్త గైడ్ లైన్స్ ను తీసుకు రావడం జరిగింది. అయితే కొత్త రూల్ ప్రకారం పూర్తిగా ఆన్లైన్ లోనే చేసుకో వచ్చని చెప్పారు. అప్లికేషన్ మొదలు లైసెన్స్ ప్రింటింగ్ వరకూ పూర్తిగా ఆన్లైన్ లోనే చేసుకోవచ్చు.

ఆర్సి రెన్యువల్ లో కూడా ఈ గైడ్ లైన్స్ ని తీసుకు రావడానికి గల కారణం ఏమిటంటే..? కొత్త వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా అవుతుంది. 60 రోజుల అడ్వాన్స్ గా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందొచ్చు. ఇదిలా ఉంటే టెంపరరీ రిజిస్ట్రేషన్ కూడా ఒక నెల నుంచి ఆరు నెలల కి పెంచారు.

డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్టిఓ ఆఫీస్ కి వెళ్లక్కర్లేదు:

దీంతో పాటు ప్రభుత్వం లైసెన్స్ లో కూడా కొన్ని మార్పులు చేశారు. డ్రైవింగ్ టెస్ట్ కోసం ఆర్ టి ఓ ఆఫీస్ కి వెళ్లక్కర్లేదు. ఇది కూడా కేవలం ఆన్లైన్లోనే చేసుకోవచ్చు.

డిఎల్, ఆర్సీ వాలిడిటీ ని పెంచారు:

మోటార్ వెహికల్ డాక్యుమెంట్స్ అంటే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫిట్నెస్ సర్టిఫికెట్ ని 30 జూన్ 2021 వరకు పెంచారు. కరోనా కేసులు మరోసారి మరింత ఎక్కువైపోతున్నాయి దీని వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news