చర్చలు విఫలం… ఆరోగ్యశ్రీ సేవలు బంద్

-

ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే నెట్ వర్క్ ఆస్పత్రుల యాజమాన్యంతో ఆరోగ్య శ్రీ సీఈవో ఈ సాయంత్రం జూమ్ యాప్ ద్వారా చర్చలు జరిపారు. అయితే ఈ చర్చలు విఫలమయ్యాయి.రూ. 800 కోట్ల మేర పెండింగ్ బకాయిలు చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేశాయి. అయితే ఇందుకు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవో విముఖత చూపారు. దీంతో ప్రైవేటు స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవల బంద్‌ను కొనసాగించాలని యాజమాన్యాలు నిర్ణయించారు. అయితే ఇప్పటికే ఒకసారి చర్చలు జరపగా అవి సఫలం కాలేదు. తాజాగా మరొకసారి చర్చలు జరిగినప్పటికీ ఈసారి కూడా సఫలం కాలేదు.దీంతో ఆరోగ్య శ్రీ సేవల బంద్‌ను ఆస్పత్రులు కొనసాగించనున్నాయి.

కాగా ఆంధ్ర ప్రదేశ్ లో రోగులకు ప్రైవేటు స్పెషాలిటీ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలు కరోనా సమయంలో చికిత్సలు అందించాయి. అయితే అప్పటి నుంచి కూడా ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్య శ్రీ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం దిగొచ్చింది. రూ. 203 కోట్లు విడుదల చేసినప్పటికీ వారు ఒప్పుకోలేదు.కనీసం రూ. 800 కోట్ల అయినా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. కానీ అందుకు ప్రభుత్వం దిగి రావడంలేదు.

Read more RELATED
Recommended to you

Latest news