అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన‘పుష్ప’ సినిమా ఊహించని వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్టయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో పాటలు , స్టైల్స్ అన్ని విపరీతంగా ఆదరణ పొందాయి. రీసెంట్ గా ఈ సినిమా ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడు పుష్ప 2కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు పుష్ప 2 స్క్రిప్ట్ కోసం సుకుమార్ చాలా టైమ్ కేటాయించి పనిచేశారు. ఈ సారి కేజీఫ్ కంటే ఎక్కువ మోతాదులో ట్విస్టులు మరియు యాక్షన్ ఎపిసోడ్స్ పెట్టుకున్నారట.అయితే రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. వచ్చే నెలలో విడుదల అయ్యే అవతార్ 2 సినిమా థియేటర్స్ లో విడుదల కోసం చిన్న టీజర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా కోసం కోసం చాలా రకాల ట్విస్టులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సినిమా కోసం మరో హీరోయిన్ ను పెట్టాలని చూస్తున్నారట. ఆమె వేసేది విలన్ పాత్ర అని తెలుస్తోంది. అలాగే సినిమా లో ఆమె పొలిటికల్ రోల్ లో ఎమ్ఎల్ఏ గా చేయబోతోంది అని వార్తలు వస్తున్నాయి . ఈ పాత్ర కోసం డిజే టిల్లు లో హాట్ గా అదరగొట్టిన నేహా శెట్టి ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అవతార్ సినిమా తో థియేటర్స్ లో టీజర్ లో సందడి చేయడానికి పుష్ప రెడీ అవుతున్నాడు.