సంచలనం : నేరెడ్ మెట్ లో పంది మాంసంతో నూనె తయారీ… గుట్టురట్టు !

-

తెలంగాణ హైదేరాబద్ నెరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక నకిలీ వ్యాపారాన్ని పోలీసులు చాకచక్యంగా బట్టబయలు చేసి అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన పూర్తి సమాచార ప్రకారం ఆర్ కె పురం లోని ఒక ఇంట్లో పంది మాంసంతో శివ అనే ఒక వ్యక్తి నూనెను తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్ట్ చేశారు. ఇంట్లో పంది కొవ్వును ఉడికిస్తుండడంతో పక్క ఇంటి వారికి చెడు వాసనా రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. దీనితో రంగంలోకి దిగిన నెరేడ్ మెట్ సీఐ నాగరాజు బృందంతో వెళ్లి శివ అనే వ్యక్తి నుండి లీటర్ల పంది మాంసంతో తయారు చేసిన ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఆయిల్ ను మంచి నూనెతో కలిపి కల్తీ చేసి కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లకు పంపానని విచారణలో శివ ఒప్పుకున్నాడు. కాగా తెలుస్తున్న ప్రకారం ఈ పంది నూనెను ఎక్కువ రైతులు వాడుతున్నారట.. ఈనూనెలో బట్ట ముంచి పొలం దగ్గర వేస్తే ఆ వాసనకు అడవి పందులు , పశువులు రాకుండా ఉంటాయని తెలుస్తోంది. ఇక చుట్టుపక్కల ఉన్న వారికీ కూడా దీని వలన ప్రమాదం అని గ్రహించి ఈ కేసును పోలీసులు సీరియస్ తీసుకున్నారు.

 

కాగా ఇతను సప్లై చేసిన ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లను కనుక్కుని ఆపాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. కానీ అతనిచ్చిన ఫోన్ నెంబర్ లు పనిచేయడం లేదట. మరి ఇలా ఇంకెక్కడైనా జరుగుతున్నాయా అన్న విషయంపై పోలీసులు ద్రుష్టి సారించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news