దక్షిణాది వారిని అనే ముందు ఆ సినిమా కనిపించలేదా పూజా..

-

దక్షిణాది సినిమాల ద్వారా పాపులరై ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు తెచ్చుకుంటున్న హీరోయిన్లు, దక్షిణాది ప్రేక్షకుల విషయంలో కామెంట్లు చేయడం తరచుగా చూస్తుంటాం. బాలీవుడ్ లో అవకాశం వస్తే చాలు దక్షిణాది సినిమాల మీద కామెంట్లు చేయడం అలవాటై పోయింది. తాజాగా పూజా హెగ్డే చేసిన కామెంట్లు ఇలాగే ఉన్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో పూజా కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దక్షిణాది ప్రేక్షకులు నడుము, చిన్న చిన్న స్కర్టుల్లో హీరోయిన్లు కనిపిస్తేనే చూస్తారని ఒకానొక ఇంటర్వ్యూలో కామెంట్లు చేసింది. ఈ విషయమై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది. బాలీవుడ్ లో అసలు స్కర్టులే వేయరా, బికీనీలు వేయరా, పూజా నటించిన హౌస్ ఫుల్ 4 సినిమాలో హీరోయిన్లు చేసిందేమిటీ..? స్కిన్ షో కాదా..? ఒకరిని అనే ముందు తనని తాను చూసుకోవాలని, గురివింద నలుపెరగదు అన్నట్టుగా, బాలీవుడ్ వాళ్ళు ఆలోచిస్తున్నారని, దక్షిణాదిన పెద్ద పెద్ద సినిమాల్లో నటిస్తూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news