శ్రీరెడ్డిని స‌మంత‌, త్రిష రిక‌మండ్‌ చేయాలట‌!

-

రెండు, మూడు రోజులుగా శ్రీరెడ్డి చెల‌రేగిపోతున్న విష‌యం తెలిసిందే. దొరికిన వాళ్ల‌ను దొరికిన‌ట్లు ఆడుకుంటోంది. ముఖ్యంగా జీవిత చేసిన గ‌త కామెంట్ల‌ను గుర్తుచేసి మ‌రీ ఫైర్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో `మా `అసోసియేష‌న్ లో మెంబ‌ర్ షిప్ కార్డు ఇవ్వ‌లేదంటూ పాత పాట మొద‌లు పెట్టింది. చిన్న స్థాయి న‌టుల వ్య‌ధ‌ల‌ను త‌న‌దైన శైలిలో చెప్పే ప్ర‌య‌త్నం చేసింది. మీలాంటి వాళ్ల వ‌ల్లే మాలాంటి సినిమా రంగంలో ఎద‌గ లేక‌పోతున్నార‌ని గ‌ళం విప్పింది. ప‌రోక్షంగా టాలెంట్‌ ను తొక్కేస్తున్నార‌ని పెద్ద ప‌ద‌మే వాడింది. అలాగే స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన వారంతా శ్రీరెడ్డి లాంటి వాళ్ల‌ని పైకి లేపాల‌ట‌. స‌మంత‌, త్రిష లాంటి వారు చిన్న స్థాయి నుంచే పెద్ద స్టార్లు అయ్యారు.

netizens fire on sri reddy

ఎదిగే క్ర‌మంలో క‌ష్టాలు ప‌డ్డారు. అలాంటి వారికి ఇండ‌స్ట్రీలో ఎన్నో ప‌రిచ‌యాలుంటాయి. స‌హాయం చేసే అవ‌కాశం ఉన్నా చేయ‌రు. అంతా కుళ్లు బుద్ది. త‌మ‌కే కాంపిటీష‌న్ గా మారుతామ‌నే అభ‌ద్ర‌తా భావం అంటూ భారీ డైలాగులే కొట్టింది. అవ‌కాశం లేని వాళ్లు చివ‌రికి పొట్ట‌కూటి కోసం వ్య‌భిచారం చేస్తున్నార‌ని ఆవేద‌న చెందింది. అయితే వీటిలో కొన్ని వ్యాఖ్యల‌పై నెటిజ‌న్లు నిప్పులు చెరుగుతున్నారు. హీరోయిన్ అవ్వాలంటే కొన్ని క్వాలిఫికేష‌న్స్ కావాలి. వాటిలో నీకు ఒక్క‌టి కూడా లేదు. సినిమాలంటే భోజ‌నం చేయ‌డం కాదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిట్టిన అంత ఈజీ కాదు. అంతా క‌ష్ట‌ప‌డే పైకి ఎదిగారంటున్నావ్ గా! నువ్వు క‌ష్ట‌ప‌డి ఎదుగు. అప్పుడు నిన్ను అపేది ఎవ‌రు? కష్టే ఫ‌లి అన్నారుగా.

ఆ మాట ఇప్పుడు గుర్తుకు రావ‌డం లేదా? ఎదుట వారిని నిందించ‌డం కాదు! క‌ష్ట‌ప‌డే త‌త్వం ఉండాలి. అది నీలో ఏ కోశాన‌ క‌నిపించ‌లేదు. అదే ఉండుంటే ఈపాటికే పెద్ద హీరోయిన్ అయ్యేదానివి. అది మానేసి ఎదుటి వారిని బ్లేమ్ చేయ‌డం…వాళ్ల గురించి..వీళ్ల గురించి అవాకులు చెవాకులు పేల‌డం దేనికి! నీ ప‌నేదో నువ్వు చూసుకో. ఇప్ప‌టికైనా వాస్త‌వాన్ని గ్ర‌హిస్తావ‌ని ఆశిస్తున్నామంటూ నెటిజ‌న్లు నిప్పులు చెరిగారు. అయినా కుక్క తోక వంకర‌ పోదుగా! నీకు చెప్ప‌డం అంటే చెవిటి వాడి చెవిలో శంఖం ఊదిన‌ట్లే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news