అబ్బో అలాగా.. కేటీఆర్‌ని సీఎం చేస్తారా ధర్మపురి అర‌వింద్‌ గారు?

-

న‌వ్విపోదురుగాక నాకేంటి అన్న చందాగా ఉంది బీజేపీ య‌వ్వారం. చ‌చ్చి చెడి గెలిచిన నిజామాబాద్‌ ఎమ్మెల్యే చిల‌క జ్యోతిష్యాలు చెప్పుకుంటున్నారు. గాలివాటంగా వ‌చ్చిన గెలుపును చూసి త‌నే సీఎం పీఎంగా ఫీల‌వుతున్నారంటూ బీజీపీ కార్య‌క‌ర్త‌లే గుస‌గుస‌లాడుకుంటున్నారు. అస‌లు విష‌యం ఏంటంటే కేటీఆర్‌ను సీఎం చేసేస్తాడట ధర్మపురి అరవింద్‌ గారు.. అదెట్టా అంటే అది అంతే ఆయ‌నేగా సీఎం, పీఎం..

కొడుకుని సీఎం చేయ‌డానికే కేసీఆర్‌ స‌చివాల‌యాన్ని కూల్చేస్తున్నార‌ట‌… అదీ ఆయ‌న‌గారి తర్కం.. అదెలా సాధ్యం.. అంటే.. అదంతే మ‌రి.. బీజేపీకి స‌భ్య‌త్వాలు పెరిగాయ‌ట‌..రాబోయే ఎన్నికల్లో బిజేపీదే విజయం కాబట్టి కేటీఆర్‌కు సీఎం కావాలని కోరికుంటే ఇప్పుడు అయితేనే ఛాన్స్‌ అట. తర్వాత కుదరదని వీరి హితభోధ.

తెలంగాణలో బీజేపీ హవా ప్రారంభం అయింది కనుక, ఎన్నికలు ఎప్పుడొచ్చినా వందకు తక్కువ కాకుండా గెలుస్తాం.. అంటూ మ‌రో 5 ఏళ్ల త‌రువాత బిజెపీదే అధికారం అని సారు చెప్పుకోవ‌డం న‌వ్వుల పాలైంది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలపైనా అరవింద్ అటాక్ చేశారు. సొంత పార్టీని చక్కబెట్టుకోలేని కాంగ్రెస్ నేతలు శుద్ధులు పలుకుతున్నారంటూ విమర్శించారు. ముందు సొంత పార్టీని చక్కబెట్టుకోవాలని హితవు పలికారు.

ఇంకొకాయ‌న బండి సంజ‌య్… ఈయ‌నా చెబుతున్నారు.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల‌ట బీజేపీలో చేరుతామ‌ని లైన్ క‌డుతున్నార‌ట‌.. వాపుకు బలుపుకు తేడా తెలియని వీరి డైలాగుల‌కు న‌వ్వుకుంటున్నార‌క్క‌డ‌.

Read more RELATED
Recommended to you

Latest news