క్రైమ్ థ్రిల్లర్ గా నయనతార “నేత్రికన్” ట్రైలర్

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో హీరోయిన్ గానే కొనసాగిన ఈ లేడీ సూపర్ స్టార్…. ఆ తర్వాత… లేడీ హీరోగా కూడా సినిమాలు కూడా చేసింది. అయితే తాజాగా  నేత్రికన్ అనే సినిమాను నయనతార చేస్తోంది. ఈ సినిమాలో అజ్మల్ అమీర్, శరణ్, హిందూజా, మణికందన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

రౌడీ పిక్చర్స్ మరియు క్రాస్ పిక్చర్స్ బ్యానర్ లపై… విగ్నేష్ శివన్ నిర్మించారు. ఎడిటర్ గా లారెన్స్ కిషోర్, యాక్షన్ డైరెక్టర్ గా దిలీప్ సుబ్బారాయన్, ఆర్ట్ డైరెక్టర్ గా ఎస్ కమలనాథన్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఇక ఈ మూవీ వచ్చేనెల అంటే ఆగస్టు 13వ తారీఖున డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ కానుంది. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు చిత్రబృంద సభ్యులు. క్రైమ్ సీన్లతో ఆద్యంతం ఈ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది. ప్రతి సీన్ చాలా ఆసక్తికరంగా కనిపించింది. అలాగే ఈ సినిమాకు విజువల్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగా కలిసొస్తాయని ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది.