హైదరాబాద్ నగరంలో మరో 248 డబుల్ బెడ్ రూం ఇండ్లు లబ్ది దారులకు అందుబాటులోకి వచ్చాయి. సనత్ నగర్ నియోజక వర్గంలోని బన్సీలాల్ పేట డివిజన్ చాచా నెహ్రు నగర్ లో నిర్మించిన 248 డబుల్ బెడ్ రూం ఇండ్ల ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. లబ్ది దారులకు ఇండ్ల పట్టాలనున పంపిణీ చేశారు. చాచా నెహ్రు నగర్ లోని 3.35 ఎకరాల్లో రూ. 19.20 కోట్ల వ్యయంతో 264 ఇండ్లను నిర్మించారు. మౌలిక వసతులతో పాటు 50, 20 కిలో లీటర్ల నీటి సంపులను నిర్మించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. లంచాలు తీసుకుని ఇండ్లు ఇస్తామని చెప్తే నమ్మోద్దని పేర్కొన్నారు. ఇండ్ల విషయంలో ఎలాంటి వైరవీలు ఉండవని.. లాటరీ పద్దతిలో బస్తీ వాసులకు ఇండ్ల కేటాయిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో.. మంత్రులు తలసాని శ్రీ నివాస్ యాదవ్, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, జీహెచ్ ఎంసీ మేయర్ విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.