ఆదిలాబాద్‌లో ట్రయాంగిల్ ఫైట్.. కారు లీడింగ్ తగ్గుతుందా?

-

తెలంగాణలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది…అయితే ఇప్పటినుంచే రాజకీయ పార్టీలు నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఒక పార్టీపై మరొక పార్టీ పైచేయి సాధించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. మొన్నటివరకు అంటే టీఆర్ఎస్‌కు తిరుగులేని బలం ఉండేది. కానీ ఆ పార్టీపై ఇప్పుడు కాస్త వ్యతిరేకత పెరుగుతుంది. ఇటు బీజేపీ, కాంగ్రెస్‌లు సైతం పుంజుకుంటున్నాయి. దీంతో రాష్ట్రంలో ట్రైయాంగిల్ ఫైట్ నడుస్తోంది.

TRS-Party | టీఆర్ఎస్
TRS-Party | టీఆర్ఎస్

నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ట్రైయాంగిల్ ఫైట్ నడవటం ఖాయమనే చెప్పాలి. అయితే ఇప్పటికే పలు జిల్లాల్లో కారు పార్టీకి ధీటుగా బీజేపీ, కాంగ్రెస్‌లు పుంజుకుంటున్నాయి. ఆ పార్టీకి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నాయి. ఇదే క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ, కాంగ్రెస్‌లు వచ్చాయి. గత ఎన్నికల్లో జిల్లాలో కారు హవా నడిచింది. జిల్లాలో 10 సీట్లు ఉంటే 9 సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంది. ఒక ఆసిఫాబాద్‌లో మాత్రం కాంగ్రెస్ గెలిచింది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే..టీఆర్ఎస్‌లోకి వెళ్ళిపోయారు. దీంతో జిల్లా మొత్తం టీఆర్ఎస్ గుప్పిట్లోకి వెళ్లింది.

అయితే 2019 పార్లమెంట్ ఎన్నికల నుంచే ఇక్కడ సీన్ మారింది. ఆ ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీ సీటుని బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో ఆదిలాబాద్ రాజకీయాలు ఒక్కసారిగా మారుతూ వచ్చాయి. ఈ మూడేళ్లలో ఆదిలాబాద్‌లో కారుకు వ్యతిరేకంగా రాజకీయం మారుతూ వచ్చింది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తోంది.

పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్‌కు ధీటుగా కాంగ్రెస్ ఉండగా, కొన్ని నియోజకవర్గాల్లో కారుకు బీజేపీ చుక్కలు చూపించేలా ఉంది. నిర్మల్, మంచిర్యాల, బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ స్ట్రాంగ్ అవుతుంది. ముధోల్, ఆదిలాబాద్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో బీజేపీ దూసుకొస్తుంది. బెల్లంపల్లిలో బి‌ఎస్‌పికి కాస్త పట్టు ఉంది. చెన్నూర్, సిర్పూర్ నియోజకవర్గాల్లో ట్రైయాంగిల్ ఫైట్ ఉంది. మొత్తం మీద ఆదిలాబాద్‌లో ట్రైయాంగిల్ ఫైట్ నడిచేలా ఉంది. నెక్స్ట్ ఎన్నికల్లో కారు లీడ్ మాత్రం తగ్గేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news