UIDAI నుంచి కొత్త యాప్‌.. ఆధార్‌ ఫేస్‌ అథంటికేషన్‌..ఇకపై అన్నీ ఫోన్లోనే..!

-

ఆధార్‌ కార్డుకు సంబంధించి కేంద్రం ఇప్పటికే ఎన్నో వెసులుబాటు చేస్తుంది. ఇప్పుడు కొత్తగా ఒక యాప్‌ను UIDAI తీసుకొచ్చింది. ఈ యాప్‌ ద్వారా సొంతగానే ఫేస్‌ అథంటికేషన్‌ పూర్తి చేసుకోవచ్చు. గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఈ యాప్‌ను ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఈ యాప్‌ పేరు ఆధార్‌ ఫేస్‌ ఆర్‌డీ యాప్‌. ఈ యాప్‌ ద్వారా ఏంటి ప్రయోజనం ఎలా లాగిన్‌ అవ్వాలో చూద్దాం.
ఈ యాప్‌ ద్వారా జీవన్ ప్రమాణ్, పీడీఎస్, స్కాలర్‌షిప్ స్కీమ్స్, కోవిన్, ఫార్మర్ వెల్ఫేర్ స్కీమ్స్ వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు’ అని యూఐడీఏఐ ట్వీట్ చేసింది. ఆధార్ కార్డు కలిగిన వారి ఆధార్ నెంబర్లు, ఇతర డెమొగ్రాఫిక్ లేదా బయోమెట్రిక్ డేటాను ఫేస్ అథంటికేషన్ కోసం సెంట్రల్ ఐడెంటిటీ డేటా రెపోజిటరీలో స్టోర్ చేసుకోవచ్చు. యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఆధార్‌ కార్డుదారులు ఎక్కడి నుంచి అయినా ఫేస్‌ అథంటికేషన్‌ (Aadhaar Face Authentication)ను పూర్తి చేసుకోవచ్చు. మీ మొబైల్‌లో యాప్‌ ఉంటే చాలు.. ఫోన్‌ ద్వారా మీ ఫేస్‌ స్కానింగ్‌తో అథంటికేషన్‌ పూర్తి చేసుకోవచ్చు.

 ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్‌లోకి ఎలా లాగిన్ అవ్వాలి?

 గూగుల్ ప్లేస్టోర్‌లోని వెళ్లి ఆధార్ ఫేస్ ఆర్‌డీ యాప్‌లోకి సెర్చ్ చేయాలి. తర్వాత ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
మీరు ఫేస్ అథంటికేషన్ పూర్తి చేసుకోవడానికి స్క్రీన్‌పై కనిపిస్తున్న నిబంధలను తెలుసుకోండి. తర్వాత ప్రోసీడ్‌పై క్లిక్ చేయండి.
ఫేస్ అథంటికేషన్ సక్సెస్‌ఫుల్ అవ్వాలంటే మీరు లైటింగ్ ఉన్న చోట నిలుచోండి. అలాగే బ్యాక్‌గ్రౌండ్ కూడా క్లియర్‌గా ఉండేలా చేసుకోండి.
ఆధార్ కార్డు కలిగిన వారి ఐడెంటిటీని గుర్తించడానికి ఫేస్ అథంటికేషన్ ఫీచర్ కూడా ఉపయోగించొచ్చని యూఐడీఏఐ తెలిపింది. ఫేస్ అథంటికేషన్ అంటే యాప్ మీ ఫేస్ స్కాన్ చేస్తుంది. ఇలా స్కాన్ చేసిన డేటా మీరు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సమయంలో ఇచ్చిన ఫేస్ డేటాకు సరిపోవాలి. అప్పుడే మీ ఫేస్ అథంటికేషన్ పూర్త అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version