తెలంగాణా కొత్త ఆర్‌టీఐ కమీషనర్లు వీరే…!

-

తెలంగాణ సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కమిషన్‌లో ఖాళీగా ఉన్న కమిషనర్ల నియామకాలను తెలంగాణా ప్రభుత్వం భర్తీ చేసింది. ఐదుగురు కొత్త ఆర్టీఐ కమిషనర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. కట్టా శేఖర్ రెడ్డి, గుగులోతు శంకర్ నాయక్, సయ్యద్ ఖలీలుల్లా, మైదా నారాయణరెడ్డి, డాక్టర్ మొహ్మద్, అమీర్ హుస్సేన్‌లను ఆర్టీఐ కమిషనర్లుగా నియమిస్తూ,

రాష్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేరుతో ప్రభుత్వం ఆదేశాలు జారి చేసింది. ఈ అయిదుగురు కమీషనర్లు బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 3 ఏళ్ళ పాటు పదవిలో సేవలు అందిస్తారు. ఒక వేల వారికి 65 ఏళ్ళ వయసు వస్తే మాత్రం ముందే వైదొలుగుతారు. కట్టా శేఖర్ రెడ్డి నమస్తే తెలంగాణ ఎడిటర్ ఎడిటర్‌గా ఉన్నారు. టీ న్యూస్ సీఈఓగా మైదా నారాయణరెడ్డి ఉన్నారు.

టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ గా ఉన్న డాక్టర్ మొహ్మద్ అమీర్ హుస్సేన్ ప్రస్తుతం కేసీఆర్ సేవాదళ్ సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. సయ్యద్ ఖలీలుల్లా విషయానికి వస్తే వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉండగా ఆయన పేరుని మజ్లీస్ పార్టీ ప్రతిపాదించింది. ఈ నియామకాల కోసం సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం అంటే ఈ నెల 7న సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. సెర్చ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news