దేశ వ్యాప్తంగా కొత్తగా ఆరు కరోనా వేరియంట్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ముందు నుండీ భయపడినట్టుగానే భారత్ లోకి యూకే కరోనా స్ట్రెయిన్ ఎంటర్ అయింది. నవంబర్ 25 నుంచి డిసెంబరు 23 అర్ధరాత్రి వరకు యూకె నుంచి ఇండియాకు 33 వేల మంది వచ్చారని అంటున్నారు.
యూకే రిటర్న్స్ అందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసింది వైద్య ఆరోగ్య శాఖ. ఇప్పటికి దేశ వ్యాప్తంగా యూకే రిటర్న్స్ లో 114 మందికి పాజిటివ్ అని తేలింది. ఆ పాజిటివ్ వచ్చిన వారి అందరి శాంపిల్స్ ని జీన్ మ్యాప్ చేసిన శాస్త్రవేత్తలు అందులో ఇప్పటి వరకు ఆరుగురికి యూకే స్ట్రెయిన్ ఉన్నట్లు గుర్తించారు. 3 బెంగళూరు, ఒకటి పూణే, తెలుగు రాష్ట్రాల్లో రెండు స్ట్రెయిన్ కేసులు వచ్చాయి. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమలో ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలు రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది.