ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా స్ట్రైన్ కేసులు భారత్ ను కూడా టెన్షన్ పెడుతున్నాయి. ఏకంగా ఒక రోజులో 20 కొత్త కరోనా కేసులు నమోదు కావడం సంచలనంగా మారింది. ఈ కొత్త కరోనా కేసులకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ఆ ప్రకటన ప్రకారం భారత్ లో కొత్త కరోనా కేసులు 58కి చేరాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో 20 కొత్త కేసులను గుర్తించినట్లు సమాచారం. ఈ కొత్త కరోనా సోకిన అందరినీ వివిధ రాష్ట్రాల్లో నియమించబడిన హెల్త్‌కేర్ సెంటర్లలో ఐసోలేషన్లో ఉంచారు. వీరి కాంటాక్ట్ లనుకూడా ప్రస్తుతానికి ఐసోలేషన్లోనే ఉంచారు. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కేసులు కూడా ఉండడంతో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయి.