ఈరోజు నుంచి తెలంగాణలో అమలులోకి వచ్చిన కొత్త జిల్లాలు

-

 

తెలంగాణలో ఇవాళ్టి నుంచి మరో రెండు జిల్లాలు అమలులోకి వచ్చాయి. నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు ఉన్న 31 జిల్లాలను కలిపి మొత్తం 33 జిల్లాలు అయ్యాయి.

11 మండలాలతో నారాయణపేట జిల్లా

ఇప్పటి వరకు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 11 మండలాలను కలిపి కొత్తగా నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేశారు. నారాయణపేట, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, కోస్గీ, మద్దూర్, ఊట్కూర్, నర్వ, మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాలతో నారాయణపేట జిల్లా ఏర్పడింది.

రెవెన్యూ డివిజన్, జిల్లాగా నారాయణపేట ఉంటుంది. నారాయణపేట మండలంలో 26 గ్రామాలు ఉంటాయి. దామరిగిద్దలో 27 గ్రామాలు ఉండగా… ధన్వాడలో 9, మరికల్ లో 14, కోస్గీలో 26, ఊట్కూర్ లో 27, మాగనూర్ లో 20, కృష్ణలో 14, నర్వలో 20, మద్దూర్ లో 30, మక్తల్ మండలంలో 39 గ్రామాలు ఉంటాయి.

9 మండలాలతో ములుగు జిల్లా..

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ములుగు రెవెన్యూ ఢివిజన్ ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేశారు. 9 మండలాలతో కలిపి ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు. ములుగు, వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వెంకటాపురం, వాజేడు మండలాలతో కలిపి ములుగు జిల్లాను ఏర్పాటు చేశారు.

ఇక.. గ్రామాల వారీగా చూసుకుంటే… ములుగు మండలంలో 19 గ్రామాలు, వెంకటాపూర్ లో 10 గ్రామాలు, గోవిందరావుపేటలో 14, తాడ్వాయిలో 73, ఏటూరు నాగారంలో 39, కన్నాయిగూడెంలో 25, మంగపేటలో 23, వెంకటాపురంలో 72, వాజేడు మండలంలో 61 గ్రామాలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news