కేసీఆర్ బర్త్ డే… మోదీ, జగన్ ట్వీట్లు..!

-

modi and jagan tweets on cm kcr birth day

తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సీఎం కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో… ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్, వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, వైసీపీ అధినేత జగన్ తదితరులు ఉన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కు బర్త్ డే శుభాకాంక్షలు. ఆయనకు ఆయురారోగ్యాలను ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ మోదీ ట్వీట్ చేశారు.

హ్యాపీ బర్త్ డే కేసీఆర్ గారు. మీరు ఆయురారోగ్యాలతో, నిండు జీవితాన్ని గడపాలని మనసారా కోరుకుంటున్నాను.. అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

కేసీఆర్ గారు నిండుజీవితంతో, ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా ఉండాలని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం మొక్కలు నాటాం. అరుదైన నాయకుడు, పోరాట యోధుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన నా తండ్రి కూడా అయినందుకు గర్వంగా ఉంది.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news