ఆస్ట్రేలియాలో కార్చిచ్చు దాదాపు ఆరు నెలల నుంచి చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. లక్షల ఎకరాల్లో అడవులను ఈ కార్చిచ్చు దహించి వేస్తుంది. గత నాలుగు రోజుల నుంచి ఆ దేశంలో పలు రాష్ట్రాల్లో వర్షాలు పడటంతో మంటలు కాస్త అదుపులోకి వచ్చాయి. కొన్ని కొన్ని చోట్ల దట్టమైన పొగతో ప్రజలు ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అక్కడి ప్రజలకు కొత్త కష్టం వచ్చింది.
ఈ మంటల్లో కోట్లాది అడవి జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. మరి కొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. అయితే మరణించిన జంతువుల నుంచి తీవ్రమైన దుర్వాసన వస్తుంది. లక్షల జంతువులు సగం కాలి సగం కాలక అలాగే ఉండిపోయాయి. గాయపడిన జంతువులు కొన్ని ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పుడు వర్షాలు పడటంతో వాటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుంది. అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు,
ఆ వాసన భరించలేక వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిపోతున్నారు. గాయపడిన జంతువులు కొన్ని మరణించే స్థితిలో ఉన్నాయి. వాటి సంఖ్య కూడా భారీగానే ఉంది ఈ దుర్వాసన ఇప్పుడు అనారోగ్యాలకు కూడా దారి తీస్తుంది. దానికి తోడు ఇటీవల అక్కడి ప్రభుత్వం కొన్ని ఒంటెలను కాల్చి చంపింది. దీనితో ఆ దుర్వాసన కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దీనిని తగ్గించడానికి అధికారులు దృష్టి పెట్టారు.