నిరుద్యోగులకు ఎల్‌ అండ్‌ టీ ఇన్ఫోటెక్‌ గుడ్‌న్యూస్‌!

-

నిరుద్యోగులకు ఎల్‌ అండ్‌ టీ (లారెన్స్‌ అండ్‌ టర్బో) తీపికబురు చెప్పింది. వచ్చే సంవత్సరం మార్చిలోగా 4,500 ఫ్రెషర్స్‌ని నియమించుకోనుంది. ఈ మల్టీనేషనల్‌ టెక్‌ కన్సల్టింగ్, డిజిటల్‌ సొల్యూషన్‌ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,500 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు తాజాగా ప్రకటించింది. ముఖ్యంగా ఉద్యోగ వలసలను నియంత్రించే చర్యల్లో భాగంగా కొత్త పనికి శ్రీకారం చుట్టింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ ఐటీ సంస్థ 3,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. ఎల్‌టీఐ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్, ఎండీ సంజయ్‌ జలోనా తెలిపారు.

job
job

కరోనా తరువాత అవకాశాలు మెరుగు పడటంతో, నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులు మంచి ఉద్యోగాలకు మారుతున్నారు. దీంతో ప్రముఖ కంపెనీల్లో వలసలు పెరిగాయి. ఐటీ దిగ్గజం టీసీఎస్‌ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 8.6 శాతంతో అత్యల్ప అట్రిషన్‌ రేటును నమోదు చేసింది. మార్చి త్రైమాసికంలో ఆ సంస్థ అట్రిషన్‌ రేటు 7.2 శాతం ఉండగా, తదుపరి త్రైమాసికానికి పెరిగింది. ఇన్ఫోసిస్‌లో మార్చి త్రైమాసికానికి అట్రిషన్‌ రేటు 10.9 శాతం ఉండగా, జూన్‌ నాటికి 13.9 శాతానికి పెరిగి రెండవ అత్యల్ప అట్రిషన్‌ రేటును కలిగి ఉంది.

అట్రిషన్‌ ఉన్నప్పటికీ, లాభాల పరంగా ఎల్‌టీఐ దూసుకుపోతోంది. గత నెలలో రూ.496.3 కోట్ల నికర ఆదాయంతో.. ఒక ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అత్యధిక లాభాలను ఆర్జించింది. కంపెనీ నికర ఆదాయం కూడా రెట్టింపయింది. ముఖ్యంగా యూరప్, ఉత్తర అమెరికా నుంచి వచ్చిన ఒప్పందాల కారణంగా జూన్‌ త్రైమాసికంలో లాభాలు వచ్చినట్లు జలోనా పేర్కొన్నారు. డిజిటల్‌ స్పేస్‌లో కొత్త ట్రెండ్స్‌ గురించి మాట్లాడుతూ.. క్లౌడ్, డేటా సంబంధిత అన్ని విభాగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news