కరోనాకు కొత్త మాస్క్… ఇది వస్తే సూపర్ ఇక…!

-

కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించడానికి గానూ శాస్త్ర వేత్తలు ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి గాను ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గుజరాత్ శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగం చేసారు. భావ్‌నగర్‌కు చెందిన సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిఎస్‌ఎంసిఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ప్రత్యేక ఫేస్-మాస్క్‌ను అభివృద్ధి చేసారు.

మాస్క్ పైపొరను పారదర్శక పాలిసల్ఫోన్ పదార్థంతో రూపొందించారు. 150 మైక్రోమీటర్ల మందంతో ఉంటుందని ఈ మెటీరియల్ 60 నానోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వైరస్ ను తొలగించే సామర్ధ్యం కలిగి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కోరనా వైరస్ 80-120 నానోమీటర్ల మధ్య వ్యాసం ఉంటుంది. ఈ మాస్క్ కు ఇంకా వైద్యపరంగా ఏ ఆమోదం రాలేదు. ఆమోదం వస్తే ప్రజలకు అందుబాటులోకి తక్కువ ధరకే అందిస్తామని అన్నారు.

ఇప్పటి వరకు మాస్క్ లను ఉతికి వాడుకునే అవకాశం లేదు. కాని దీన్ని మాత్రం ఉతికి వాడుకునే అవకాశం ఉంటుంది. రూ. 25 నుండి 45 రూపాయలు దీని తయారికి ఖర్చు అవుతుంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) కు అనుబంధంగా ఉన్న సిఎస్ఎంసిఆర్ఐ యొక్క మెమ్బ్రేన్ సైన్స్ అండ్ సెపరేషన్ టెక్నాలజీ విభాగం చీఫ్ డాక్టర్ వి.కె. మాట్లాడుతూ ఇలాంటి మాస్కుల అవసరం ఉంటుందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news