అమావాస్య రోజు కేసీఆర్ షెడ్యూల్‌.. విష‌యం తెలుసుకుని క్యాన్సిల్‌

-

సీఎం కేసీఆర్ (KCR) ఏ ప‌ని అయినా ప‌క్కాతే తిది, న‌క్ష‌త్రం, వాస్తు, ముహూర్తం చూసుకుని చేస్తారు. వీటిల్లో ఏది తేడా వ‌చ్చినా ఆ పనిని ముట్టుకోరు. మంచి ముహూర్తం అయితే వెంట‌నే చేసేస్తారు. ఎవ‌రు ఏం అనుకున్నా పెద్ద‌గా ప‌ట్టించుకోరు. అయితే ఇప్పుడు ముహూర్తం చూడ‌కుండా షెడ్యూల్ ఫిక్స్ చేయ‌డం.. అది కాస్తా అమావాస్య కావ‌డంతో ఏకంగా షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేశాడు సీఎం కేసీఆర్‌.

 

విష‌యం ఏంటంటే.. ఈ నెల 10 సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లాకు వెళ్లాల్సి ఉంది. అక్క‌డ ప‌ర్య‌టించి క‌లెక్ట‌రేట్, పోలీసు భ‌వ‌నాల‌ను ప్రారంభించాల్సి ఉండేది. అయితే ఈ షెడ్యూల్‌ను ముందే ఫిక్స్ చేసిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు క్యాన్సిల్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

కార‌ణం ఏంటంటే.. ఈ నెల 10న అమావాస్య‌. ఆ రోజు కొత్త భ‌వ‌నాల‌ను సీఎం ఎలా ప్రారంభిస్తార‌ని ఏకంగా క్యాన్సిల్ చేశారంట‌. ఈ విష‌యాన్ని ఏకంగా మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి వివ‌రించారు. ముహూర్తాల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చే కేసీఆర్ అమావాస్య రోజు అలాంటి ప‌నులు చేయ‌ర‌ని చెప్పారు. మ‌రి ఆ మాత్రం తెలుసుకోకుండా ముందే ఎందుకు షెడ్యూల్ ఖ‌రారు చేశారంటూ సీఎంవో అధికారులు ప్ర‌శ్నిస్తున్నారంట‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version