ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ రోజు రోజు కు బలహీనం అవుతుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయడానికి అధిష్టానం దృష్టి సారించినట్టు తెలుస్తుంది. అందు కోసం ఈ నెల 21, 22 తేదీ లలో ప్రత్యేక సమావేశాలను కాంగ్రెస్ అధిష్టానం నిర్వహిస్తున్నట్టు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ జనవర్ సెక్రటరీ ఉమశ్ చాందీ తెలిపారు.
ఈ సమావేశం లో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల సెక్రటరీ ఉమేశ్ చందీ తో పాటు ఎపీ ఇంచార్జీ కార్యదర్శులు మయ్యప్పన్, క్రిస్టోఫర్ తిలక్ కూడా పాల్గోంటారని తెలుస్తుంది. అయితే రాష్ట్రానికి కొత్త పీసీసీ విషయం లో ఏపీ కాంగ్రెస్ సీనియర్ నాయకల తో ఉమేష్ చాందీ చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ విషయం పై కాంగ్రెస్ నాయకులను అందరీని కూడా విజయవాడ కు రావాలని కూడా ఉమేష్ చాందీ సూచించినట్టు తెలుస్తుంది. అయితే ఈ నెల 21, 22 తర్వాత ఏపీ కి కొత్త పీసీసీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.