హైదరాబాద్ శివారులోని మంచిరేవుల ఫామ్ హౌస్ లో ఆదివారం రాత్రి పేకాట ఆడుతూ పట్టుబడ్డ సంఘటన తెలిసిందే. టాలీవుడ్ హీరో నాగ శౌర్య లీజుకు తీసుకున్న ఈ ఫాంహౌస్ లో పట్టుబడిన పేకాట రాయుళ్ళ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. నాగ శౌర్య ఫాం హౌస్ లో ఆదివారం గుత్తా సుమన్ పేకాట స్థావరం ఏర్పాటు చేసారు. ఈ నేపథ్యం లోనే ఆదివారం రాత్రి 30 మంది నీ అరెస్ట్ చేశారు పోలీసులు.
అయితే ఈ కేసు లో తవ్వే కొద్ది గుత్తా సుమన్ ఆగడాలు బయట పడుతున్నాయి. గుత్తా సుమన్ కు విదేశీ క్యాసినో నిర్వాహకులతో పరిచయాలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. పేకాట ఈవెంట్ కోసం ప్రత్యేక ఆహ్వాన పత్రికలు కూడా గుత్తా సుమన్ పంచినట్లు విచారణలో బయటపడింది. మద్యం సరఫరా , అమ్మాయిల సహాయం తో ఈవెంట్ ను గుత్తా సుమన్ నిర్వహణ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఒక సిట్టింగ్ కు 25 వేలు రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసినట్లు సమాచారం.
నగరంలో నీ హోటళ్ళు, రెస్టారెంట్ల అద్దెకు తీసుకుని స్థావరంగా ఏర్పాట్లు చేసేవాడని విచారణలో బయటపడింది. అంతేకాదు రెస్టారెంట్ లలో క్యాసినో కూడా గుత్తా సుమన్ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ కేసులో మిగిలిన 29 మందికి బెయిల్ మంజూరు చేసింది ఉప్పర్ పల్లి కోర్ట్. గుత్తా సుమన్ ను పోలీస్ కస్టడికి అనుమతి ఇచ్చింది కోర్ట్. దీంతో గుత్తా సుమన్ ను చర్లపల్లి జైల్ నుండి కస్టడీ కి తీసుకున్నారు పోలీసులు.