ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఫోన్ లకు అతుక్కుపోతున్నారు. ముఖ్యంగా టీనేజ్ లో ఉన్నవాళ్లు అయితే ఎప్పుడూ ఫోన్ పట్టుకునే కనిపిస్తున్నారు. అయితే ఆ వయసులో ఫోన్ పట్టుకుని ఉంటే కెరీర్ నాశనమవుతుందని తల్లిదండ్రులు హెచ్చరించడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే జగిత్యాల జిల్లా లో చోటు చేసుకుంది. మెట్‌పల్లి పట్టణంలోని బర్కత్‌పురాకు చెందిన షేక్ నజీముద్దీన్(18) అనే యువకుడు ఇంటర్ చదువుతున్నాడు.
అయితే నజీముద్దీన్ కొంత కాలంగా ఫోన్ అదికంగా వాడుతున్నాడు. అది గమనించిన తండ్రి ఫోన్ వాడకూడదని మందలించాడు. దాంతో నజీముద్దీన్ గత నెల 31న ఇంటి నుండి వెళ్లిపోయాడు. కాగా రెండు రోజుల తరవాత అతడి మృతదేహం కోరుట్ల లోని ఓ కెనాల్ వద్ద గుర్తించారు. ఈ ఘటన పై యువకుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.