వాహనాల మైలేజీని పెంచే మైలేజీ బూస్టర్‌!

-

సాధారణంగా మనం బండి కొంటే దాన్ని చాలా అపురూపంగా చూసుకుంటాం. కానీ, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో ఒక రిపెయిర్‌ వస్తుంది. దాంట్లో ముఖ్యమైంది మైలేజీ. తీసుకున్న కొన్ని రోజుల్లోనే మైలేజీ తగ్గిపోతుంది. దీనికి చెక్‌ పెట్టేందుకే హైదరాబాద్‌కు చెందిన మెషిన్‌ టెక్కీ డేవిడ్‌ ఎష్కోల్‌. ఈ క్రమంలో ఒక అద్భుతమైన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. 2014లో ఈ అద్భుత ఆవిష్కరణ జరగ్గా, 2008 నుంచే కేవలం మైలేజ్‌ మాత్రమే కాకుండా కర్బన వ్యర్థాల ఉత్పత్తి తగ్గించేలా పరిశోధనలు చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం. ఈయన డెవలప్‌ చేసిన 5ఎం మైటేజ్‌ బూస్టర్‌ Mileage booster ద్వారా ఇంజిన్‌ ద్వారా రిలీజ్‌ అయ్యే కార్బన వ్యర్థాలు తగ్గిపోవడమే కాకుండా మైలేజీ కూడా పెరుగుతుంది.

మైటేజ్‌ బూస్టర్‌ /Mileage booster
మైటేజ్‌ బూస్టర్‌ /Mileage booster

ఈ బూస్టర్‌ ద్వారా ఇంజిన్‌ తో పాటు పనిచేస్తుంది. సీసీ పవర్‌ ఆధారంగా నిర్ధి్దష్ట సమయంలో అల్ట్రా సోనిక్‌ తరంగాలను, గ్యాస్‌ రూపంలోని ప్లాస్మాను మైలేజ్‌ బూస్టర్‌ ద్వారా ఇంజిన్‌కు పంపిస్తామని తెలిపారు.ఈ బూస్టర్‌ను 100సీసీ నుంచి 10,000సీసీ సామర్థ్యం కలిగిన ఇంజిన్‌ లకు మైలేజ్‌ బూస్టర్‌ వ్యవస్థను అమర్చవచ్చని తెలిపారు. సాధారణంగా ఒక వెహికల్‌ 100 యూనిట్స్‌ రూపంలో ఇంధనాన్ని తీసుకుంటే అందులో కేవలం 12.5 శాతం మాత్రమే రన్నింగ్‌ లో చక్రాలకు వెళ్తోంది. మిగిలింది..మెషిన్‌ ఫ్రిక్షన్‌ ను వివిధ సందర్భాల్లో అధిగమించడానికి ఇంజిన్‌ వాడుతోంది.ఈ సమయంలో తక్కువ ఇంధనాన్ని ఉపయోగించుకునేలా మైలేజ్‌ బూస్టర్‌ వ్యవస్థ పనిచేస్తుంది. ఏదైనా మంచి ఆటోమొబైల్‌ తయారీ సంస్థ కోసం చూస్తున్నానని ఆయన తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news