JEE MAINS : జేఈఈ మెయిన్స్‌ షెడ్యూల్‌ విడుదల… దరఖాస్తుకు మరో అవకాశం

-

జేఈఈ మెయిన్ 3వ మరియు నాలుగవ విడత పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన మూడు, నాలుగవ విడత జేఈఈ మెయిన్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఫిబ్రవరి, మార్చి నెలల్లో మొదటి, రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలు జరిగాయి.

కరోనా పరిస్థితులు మెరుగు పడుతుండటంతో జేఈఈ మెయిన్ 3వ మరియు నాలుగవ విడత పరీక్షల షెడ్యూల్ విడుదల అయింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం… జేఈఈ మెయిన్ మూడో విడత జులై 20 నుండి 25 వరకు జరుగునుండగా… జేఈఈ మెయిన్ నాలుగో విడత జులై 27 నుండి ఆగస్టు 2వ తేదీ వరకు జరుగనున్నాయి.

కోవిడ్ నేపథ్యంలో పరీక్ష జరిగే పట్టణాల సంఖ్యను పెంచుతూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. గతంతో 232 గా ఉన్న పరీక్ష జరిగే పట్టణాల సంఖ్యను నుండి 334 కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే.. పరీక్ష కేంద్రాల సంఖ్యను 660 నుండి 828 కి పెంచింది. ఏప్రిల్ సెషన్ కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 6.8 లక్షలు కాగా… మే సెషన్ కు దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 6.09 లక్షలు గా ఉంది. మూడో, నాలుగో విడత జేఈఈ మెయిన్ రాయాలనుకునే వారికి…మరో అవకాశంగా దరఖాస్తు చేసుకునే వెసులు బాటు కల్పించింది సర్కార్‌.

Read more RELATED
Recommended to you

Latest news