బ్రేకింగ్ : సాప్ట్ వేర్ ఇంజినీర్ సజీవ దహనం కేసులో భార్య హస్తం ?

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పవన్ కుమార్ సజీవ దహనం ఘటనలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అదేంటంటే ఈ దహనం కేసులో ఆయన భార్య హస్తం కూడా ఉన్నట్టు చెబుతున్నారు. మొత్తం ఈ కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. మల్యాల పోలీస్ స్టేషన్ లో నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు. సజీవ దహనంలో మృతుడు పవన్ భార్య కృష్ణవేణి మూడవ నిందితురాలు అని కేసు నమోదు చేశారు.

  A1గా పవన్ బామ్మర్ది జగన్ భార్య సుమలత, A2 విజయ్ (మృతుడి పెద్ద బామ్మర్ది), A3 కృష్ణ వేణి (పవన్ భార్య), A4. ప్రమీల,,A5 స్వరూపతో పాటుగా భవాని,నిరంజన్ రెడ్డిలపై కేసు నమోదు చేశారు. హత్యలో ఐదుగురు మహిళల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మృతుడు తండ్రి గంగాధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు హత్యలో మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.