కీసర ఎమ్మార్వో కేసులో తెర మీదకు కలెక్టర్, కీసర ఆర్డీవోల పేర్లు !

-

కీసర ఎమ్మార్వో కేసు విచారణలో ఉన్నతాధికారుల పాత్ర వెలుగులోకి వచ్చింది. నిందితుల వాగ్మూలంలో కలెక్టర్, కీసర ఆర్డీవో మరో ఎమ్మార్వో పేర్లు బయట పడ్డాయి. వరంగల్ లోని హన్మకొండ ఎమ్మార్వో కిరణ్ ప్రకాష్ ద్వారానే ఆర్డీవో రవితో ఒప్పందం జరిగిందని A3 శ్రీనాథ్ వెల్లడించాడు. కీసర ఆర్డీవో రవి ద్వారనే ఎమ్మార్వో నాగరాజుతో ఒప్పదం చేస్తుకున్నామని, దాయరలోని 614, మరికొన్ని సర్వేనెంబర్స్ లోని 61ఎకరాల 20గుంటల భూమి A 2 , విఆర్యే సాయిరాజ్ A4 , అంజిరెడ్డి ద్వారా అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు.

మొయినుద్దీన్ సహా మరో 37 మంది వద్ద నుండి భూమి అగ్రిమెఃట్ చేశానని, కలక్టర్ తో భూమి మ్యూటేషన్ చేపించే బాధ్యత ఆర్డీవో, ఎమ్మార్వో చూసుకుంటా మన్నారని ఆయన పేర్కొన్నారు. దాని నిమిత్తం లంచం ఇచ్చేందుకు కోటి పదిలక్షలు వరంగల్ నుండి తీసుకొచ్చానని అన్నారు. అయితే ఎమ్మార్వో నాగరాజు కూడా కలెక్టర్, ఆర్డీవో ఆదేశాలతోనే భూ వివాదం పై మాట్లాడేందుకు గెస్ట్ హౌస్ కి వెళ్లానని శ్రీనాథ్ కు చెందిన ఎలాంటి భూ వివాదం తన పరిధిలో లేదని చెబుతున్నారు. ఇక గతంలో తన తండ్రి డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేశాడని, అలా తన తండ్రి ఉద్యోగం తనకు వచ్చినట్లు ఎమ్మార్వో నాగరాజు తెలిపాడు. తన పేరు మీద బారీగా ఆస్తులు ఉన్నట్లు నాగరాజు ఒప్పుకున్నట్టు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news