రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్.. పార్క్ హత్ హొటల్ లో కామినేని శ్రీనివాస్ – సుజనా చౌదరీలతో సుమారు గంటన్నరపాటు సమావేశమైనట్లు వస్తున్న కథనాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఒకెత్తు… తాజాగా విజయసాయి చెప్పిన మాట మరొకెత్తు అన్నట్లుగా ఉంది వ్యవహారం. ఈ వ్యవహారంలో పాల్గొన్నది ముగ్గురు మాత్రమే కాదు.. నాలుగో వ్యక్తి కూడా ఉన్నాడు.. దుష్ట చతుష్టయంలో ముగ్గురే కనిపించారు అంటూ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఒక బాంబు పేల్చారు!
ఇప్పటికే నిమ్మగడ్డ చేసిన పనితో కక్కలేక, మింగలేక ఇబ్బందులు పడుతున్న టీడీపీకి ఇది మామూలు షాక్ కాదు! టీడీపీ అనుకూల మీడియా కూడా ఈ వ్యవహారంపై.. వైకాపా చేతికి దొరికిన అద్భుత అస్త్రం అని అభివర్ణిస్తున్న వేల.. సాయిరెడ్డి “మరో వ్యక్తి” కూడా ఈ మీటింగులో ఉన్నారని కాకపోతే.. ఆయన ఆన్ లైన్ లో పార్టిసిపేట్ చేశారని చెబుతున్నారు.
“పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం..
దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు..
ఫేస్ టైం లో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు?..
మరిన్ని వివరాలు అతి త్వరలో…” అంటూ ట్విట్టర్ లో స్పందించారు విజయసాయి రెడ్డి!
దీంతో ఆన్ లైన్ లో పాల్గొన్న ఆ నాలుగో వ్యక్తి ఈయనే అంటూ సోషల్ మీడియాలో ఒక పెద్దాయన ఫోటో హల్ చల్ చేస్తుంది. ఆ పెద్దాయన ముఖం బాగా తెలిసిన ముఖాన్ని పోలి ఉందని అని కొందరు వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా కొసమెరుపు!! అది ఎవరు అన్న సంగతి కాసేపు పక్కనపెడితే… నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి మాత్రం ఇది జీవితకాలానికి సరిపడా అప్రతిష్ట అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు!!
కాగా గతంలో చంద్రబాబు పార్టీకి సంబందించిన వ్యక్తులు.. ఇతర నాయకులకు పెద్దమొత్తంలో డబ్బులు ఆఫర్ చేసున్న విషయం, బ్యాగ్ తో సహా రంగంలోకి దిగిన వైనం అప్పట్లో సంచలనం. దీన్ని ఓటుకు నోటు కేసు అని, నోటుకు ఓటు కేసు అని రకరకాల పేర్లతో పిలిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో కూడా ఒక అజ్ఞాత వ్యక్తికి సంబందించి వీడియో లేకపోయినా.. “మావాళ్లు బ్రీఫ్ డ్ మీ…” అంటూ వాయిస్ మాత్రమే వినిపించి సంచలనం సృష్టించింది. ఇదే క్రమంలో… ఈ మీటింగ్ లో కూడా ఆన్ లైన్ లో ఉన్న వ్యక్తిపై పలువురు ఆన్ లైన్ వేదికగా అనుమానాలు వ్యక్తం చేయడం కొసమెరుపు!
పార్క్ హయత్ లో కమ్మనైన ప్రజాస్వామ్యం.
దుష్ట చతుష్టయంలో ముగ్గురు దొంగలు అడ్డంగా దొరికారు.
ఫేస్ టైం లో మాట్లాడిన నాలుగో బిగ్ బాస్ ఎవరు?
మరిన్ని వివరాలు అతి త్వరలో…— Vijayasai Reddy V (@VSReddy_MP) June 23, 2020