వికారాబాద్ కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. ఇష్టపూర్వకంగానే వెళ్ళానన్న దీపిక

-

రెండు రోజుల క్రితం కిడ్నాప్ కు గురైన దీపిక కేసులో పురోగతి లభించింది. అఖిల్ తో తన ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు ఓ ఇన్‌స్పెక్టర్ కు దీపిక చెప్పినట్టు సమాచారం. దీపిక, అఖిల్‌లతో మాట్లాడిన ఇన్‌స్పెక్టర్ ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. ఈ ఇద్దరిని క్షేమంగా వికారాబాద్ తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో రెండు గంటల్లో వికారాబాద్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు వీరిద్దరినీ తీసుకు రానున్నట్టు తెలుస్తోంది.

అయితే దీపిక కిడ్నాప్ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేసుకు సంబందించిన విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ రోజు వారిద్దరూ వస్తున్న సమాచారం కూడా గోప్యంగానే ఉంచుతున్నారు పోలీసులు. ఇద్దరు ఇష్టపడి వెళ్ళిపోతే ఎందుకు ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదనే ప్రశ్నకు సమాధానం వచ్చినట్టే. అఖిల్‌ సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ రాగా వారు మరో ఫోన్ నుండి పోలీసులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు దీపికా, అఖిల్‌లు కోర్టులో కాని లేదా ఏదైనా పోలీస్ స్టేషన్ లో రక్షణ కోసం వెళ్తారని భావించిన పోలీసులకి వారి నుండి కాల్ రావడంతో ఇక కేసు క్లియర్ అయినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news