ఘట్కేసర్ కేసులో సంచలన అంశాలు వెలుగులోకి.. గ్యాంగ్ రేప్, మర్డర్ కూడా ?

-

ఘట్కేసర్ ఫార్మసీ విద్యార్థిని కేసులో పోలీసులు కీలక అంశాలు రాబట్టారు. నిన్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిని విచారించిన సందర్భంగా అనేక కీలక అంశాలను రాబట్టినట్లు తెలుస్తోంది..నాగారంలో ఉన్న రాంపల్లి చౌరస్తా దగ్గర సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు నలుగురిని అరెస్టు చేసి విచారించారు. ఈ విచారణలో ఫార్మసీ విద్యార్థిని మీద గ్యాంగ్ రేప్ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు అని చెబుతున్నారు.

RAPE

అత్యాచారం చేసిన అనంతరం ఆమెను చంపాలని కూడా ప్లాన్ చేసినట్టు నిందితులు పోలీసుల వద్ద ఒప్పుకున్నట్లు తెలుస్తోంది..అయితే చాలా సేపు పోలీస్ సైరన్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని తిరుగుతూ ఉండటంతో భయ పడిపోయిన నిందితులు బాధితురాలిని అక్కడే వదిలేసి చెట్ల పొదల్లో నుంచి తప్పించుకున్నట్లు చెబుతున్నారు. గతంలో కూడా కొంతమంది మహిళల మీద ఇదే విధంగా ప్రవర్తించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నిందితుల మీద మీద కిడ్నాప్ రేప్ బెదిరింపులకు సంబంధించిన అనేక సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు ఈ రోజు మీడియా ముందు ప్రవేశ పెట్టే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version