ఇంగ్లాండ్ వేదికగా వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ జూన్ 26వ తేదీ నుండి నిన్నటి వరకు ఆటహాసంగా జరిగింది. ప్రపంచంలోని అగ్ర క్రీడాకారులు అందరూ ఇందులో పాల్గొని సింగిల్స్ , డబుల్స్ మరియు మిక్సెడ్ డబుల్స్ లో గెలిచి టైటిల్ ను అందుకోవాలని ఆశించారు. కానీ ఎంతమంది బరిలో ఉన్నా ఒక్కో విభాగంలో ఒక్కరికే గెలిచే అవకాశం ఉంటుందని తెలిసిన విషయం తెలిసిందే. కాగా నిన్న పురుషుల సింగిల్స్ ఫైనల్ లో హోరా హోరీ పోరును ప్రేక్షకులు వీక్షించి అసలైన టెన్నిస్ ను చూశారు అని చెప్పాలి. నిన్న సాయంత్రం ప్రపంచ నెంబర్ వన్ అలకరాజ్ మరియు ప్రపంచ నెంబర్ 2 క్రీడాకారుడు నోవాక్ జొకోవిచ్ లు తలపడ్డారు. మొదటి సెట్ ను జొకోవిచ్ 6 – 1తేడాతో గెలుచుకున్నాడు, దీనితో అంతా జొకోవిచ్ విజయాన్ని సాధిస్తాడు అనుకున్నారు. కానీ యువకెరటం అలకరాజ్ అద్భుతంగా పోరాడి రెండు (7-6) మరియు మూడవ సెట్ (6-1) లను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత జొకోవిచ్ పుంజుకుని నాలుగవ సెట్ ను 6 – 3 తో చేజిక్కించుకున్నాడు.
వింబుల్డన్ 2023 ఫైనల్ లో సంచలనం… జోకోవిచ్ కి బిగ్ షాక్ … !
-