న్యూన్యూ యాప్‌!

-

యాప్స్‌ వినియోగం పెరిగింది. అందరూ స్మార్ట్‌ ఫోన్‌లు వినియోగిస్తున్నారు. వివిధ రకాల సేవలను కంపెనీలు యాప్స్‌ ద్వారానే అందిస్తున్నాయి. తాజాగా ఒక కొత్త సోషల్‌ మీడియా యాప్‌ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. ఇతరుల జీవితాన్ని ప్రభావితం చేసే శక్తిని వినియోగదారులకు కల్పిస్తోంది అదే న్యూన్యూ యాప్‌.

దీనివల్ల ఎదుటివారి జీవితాల్లోని కీలక అంశాలను నియంత్రించే అవకాశాన్ని ఈ యాప్‌ కల్పిస్తోంది. రెండు అంశాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోలేకపోతే, క్రియేటర్లు, సెలబ్రిటీలు తమ ఫాలోవర్స్‌కు ఓటింగ్‌ నిర్వహించవచ్చు. తుది నిర్ణయాన్ని.. వారి అనుచరుల ఓటింగ్‌ అభిప్రాయాలే నిర్దేశిస్తాయి.అలాగే, ఓటింగ్‌లో పాల్గొనే వ్యక్తులు కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ ప్లాట్‌ఫాంపై ప్రతి ఒక్కరూ తమ ఆప్షన్లను ఒక రకమైన సోషల్‌ స్టాక్‌ మార్కెట్‌గా మార్చుకోవచ్చు. దీంతో క్రియేటర్లు డంబు సంపాదించవచ్చు. ఇతరులు ఓటింగ్‌ అనే షేర్స్‌ ద్వారా ఎదుటివారి నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు. ఇందుకు పెట్టుబడిగా చెల్లించే మొత్తం ఐదు డాలర్లు. ఒక ఓటుకు కనీసం ఐదు డాలర్లను ఫాలోవర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ యాప్‌ ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉంది. బీటా వెర్షన్‌ లో కొందరికి న్యూన్యూ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

రచయితలు, పెయింటర్స్, మ్యుజిషియన్‌ , ఫ్యాషన్‌ డిజైనర్లు, బ్లాగర్లు ఇతర క్రియేటర్ల కోసం దీన్ని రూపొందించారు.ఈ ప్లాట్‌ఫాంలో క్రియేటర్లు తమ అభిమానులు, ఫాలోవర్లతో మరింత ఎక్కువగా కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. క్రియేటర్లు ముందు యాప్‌లో అకౌంట్‌ ఓపెన్‌ చేసుకొని, ఫాలోవర్లను సంపాదించుకోవాలి. వీరు తమ వ్యక్తిగత విషయాలపై నిర్ణయాన్ని ఫాలోవర్లకు వదిలేయవచ్చు. ఏదైనా విషయంలో తుది నిర్ణయం కోసం ఓటు వేయాలని వీడియో క్లిప్‌ల ద్వారా యాప్‌లో కోరాలి.

ఫాలోవర్లు తమకు నచ్చిన, అభిమాన క్రియేటర్ల నిర్ణయంలో భాగం అయ్యే అవకాశం కలుగుతుంది. ఇలా ఓటు వేసినప్పుడల్లా ఫాలోవర్లు కొంత డబ్బు చెల్లించాలి. దీని నుంచి కొంత కమీషన్‌ను న్యూన్యూ ప్లాట్‌ఫాం తీసుకొని, మిగతాది క్రియేటర్లకు ఇస్తుంది.

కోర్టిన్‌ స్మిత్‌ అనే మహిళా ఎంటర్‌ప్రెన్యూర్‌ న్యూన్యూ ప్లాట్‌ఫాం సహ వ్యవస్థాపకులు, సీఈఓగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సేవలను విస్తరించేందుకు ఆమె ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖ ఇన్వెస్టర్లు న్యూన్యూలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ప్లాట్‌ఫాం ద్వారా ఫాలోవర్లు, క్రియేటర్ల మధ్య బంధం మరింత బలోపేతమవుతుంది. న్యూన్యూ అనేది ఒక వ్యక్తితో సన్నిహితంగా ఉండటానికి చేసిన కొత్త మార్గం.

Read more RELATED
Recommended to you

Latest news