ప్లాస్మా థెరపీని ప్రభుత్వం కరోనా ట్రీట్మెంట్ నుండి తొలగించింది..!

-

కరోనా కారణంగా ప్లాస్మా థెరపీని ఉపయోగించడం మనం చూశాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు ప్రభుత్వం కోవిడ్ 19 కి సంబంధించి టాస్క్ ఫోర్స్ ని అపాయింట్ చేసింది. కరోనా పేషెంట్స్ పెద్ద వాళ్ళు ఉంటే వాళ్లలో ప్లాస్మా థెరపీని చేయకూడదని ప్రభుత్వం చెప్పింది.

గత కొన్ని నెలల నుంచి చూస్తుంటే ప్లాస్మా థెరపీ చాలా పాపులర్ అయ్యింది. అయితే చాలా రీసర్చ్ దీనికి సంబంధించి జరిగాయి. దీని ప్రకారం చూసుకుంటే ప్లాస్మా థెరపీ వల్ల అంత ప్రభావం ఏమీ లేనట్లు తేలింది.

పరిస్థితి మెరుగు పడకుండా ఇన్ఫెక్షన్ యొక్క తీవ్రత పెరిగిందని వెల్లడించారు. చాలా కేసుల్లో అది సరిగ్గా పని చేయలేనట్లు తేలింది. సైంటిస్ట్ లు మరియు క్లిలిసిస్ట్స్ ప్లాస్మా థెరపీని నిషేధించాలని రాశారు. నిపుణులు కూడా ఈ విషయంపై హెచ్చరించడం జరిగింది. అయితే ఇలా రీసెర్చ్ ద్వారా ప్లాస్మా వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని స్పష్టం చేశారు.

దీంతో ప్రభుత్వం ప్లాస్మా థెరపీని ఇక ఉపయోగించకూడదని వెల్లడించింది. కోవిడ్ బాధితులకు ప్లాస్మా చికిత్స అశాస్త్రీయ విధానమని ఇలా పలువురు నిపుణులు, వైద్యులు చెప్పడం జరిగింది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు కె విజయరాఘవన్‌కు రాసిన నేపథ్యంలో ఐసీఎంఆర్ మార్గదర్శకాలను నుంచి దీనిని తొలగించడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news