Naga Babu – Posani: మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ మా ఎన్నికల ప్రచారం చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ మరింత ఉత్కంఠగా మారుతున్నాయి. ఒకవైపు విష్ణు ప్యానెల్ మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్ లు ఉండగా.. వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నాడు లేని విధంగా శృతిమించి ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో ఈ ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ద్విముఖ పోరులో వీరికి సపోర్ట్ గా నిలిచే వారు కూడా లైన్ దాటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అక్టోబర్ 10న జరుగనున్న ‘మా’ ఎన్నికలలో నువ్వా నేనా అన్నట్లు ప్రచారం జోరుగా సాగుతుంది.
ఇదిలా ఉంటే.. ప్రకాశ్‌రాజ్ ప్యానల్‌కు మద్దతునిస్తున్న మెగా నటుడు నాగబాబు నిలిచారు. ఈ క్రమంలో ఆయన ఓ ఇంటర్వ్యూల్లో పాల్గొని మా ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాగే.. పవన్-పోసాని మధ్య జరిగిన మాటల యుద్దంపై స్పందించారు.పోసానిపై మండిపడ్డారు. ‘వాడి వ్యక్తి పేరు పలికి నా నోరు పాడుచేసుకోవాలనుకోవడం లేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇక ‘మా’ ఎన్నికల్లో రాజకీయ ప్రమేయం గురించి మెగాబ్రదర్ నాగబాబు మాట్లాడుతూ.. ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చిన్న సంస్థ. 900 పైచిలుకు మంది సభ్యులున్న చిన్న ఆర్గనైజేషన్. ఇలాంటి చిన్న వాటిలో రాజకీయ పార్టీలు పాత్ర ఉంటుందంటే నేను ఒప్పుకోనని చెప్పుకోచ్చారు. తన సపోర్టు.. ముందు నుంచి ప్రకాశ్ రాజ్‌కేనని, మా ఫ్యామిలీ, ఇండస్ట్రీలోని చాలా మంది హీరోలు ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా నిలిచామని, తను ‘మా’ అధ్యక్షుడు అయితే బావుంటుందనిపించిందని తెలిపారు.
అలాగే.. ప్రకాశ్ రాజ్‌పై సీవీఎల్ చేసిన వ్యాఖ్యలను నాగబాబు ఖండించారు. ప్రకాశ్‌రాజ్ దేశద్రోహి అంటూ సీవీఎల్ చేసిన వ్యాఖ్యలు నచ్చలేవని. ప్రకాశ్ ఈ దేశంలోనే పుట్టారని, ఆయన దేవుడిని నమ్మడు. కానీ, అందరికీ మంచి చేయాలనే గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తని నాగబాబు వివరించారు.