సంక్షేమం, అభివృద్ధి మాకు రెండు కళ్లూ అంటూ ఇంతవరకూ పాలించిన నాయ్కులు చెబితే… సంక్షేమం – అభివృద్ధ్తో పాటు అవినీతిరహితం కూడా తన కన్నే అంటున్నారు జగన్! గత ప్రభుత్వం చేసిన అవినీతి మొత్తాన్ని బయటపెడ్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. తనపని తానుచేసుకుపోతున్నారు వైకాపా అధినేత! ఇందులో ఎస్సీ, బీసీ, ఓసీ లాంటి తారతమ్యాలు ఏమీ లేవని… ఎవరు తప్పు చేసినా తొక్కేస్తామని… కులం కార్డుకు ఇక్కడ చోటు లేదని చెప్పకనే చెబుతున్నారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడి తర్వాత ప్లేస్ ఎవరిది అని ఏపీ మొత్తం చర్చోపచర్చలు నడుస్తున్నాయి! ఈ విషయంలో జనాల్లోనే కాదు టీడీపీలో కూడా గెస్సింగ్స్ బలంగా నడుస్తున్నాయని అంటున్నారు.
ఈ క్రమంలో జగన్ నెక్స్ట్ టార్గెట్ అగ్రీగోల్డ్ భూముల వ్యవహారం అని తెలుస్తుంది! అదే నిజమైతే… నెక్స్ట్ క్యాండిడేట్ ప్రత్తిపాటి పుల్లారావు అనే అనుకోవాలి! ఈ అగ్రిగోల్డ్ వ్యవహారంలో కీలకంగా పనిచేసిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నెక్స్ట్ బోనెక్కబోయేదన్ని అంటున్నారు! ఇప్పటికే అమరావతిలో భూములు కొనుగోలు విషయంలో ప్రత్తిపాటిపై సిఐడి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు వ్యవహారంలో కూడా ప్రత్తిపాటి పుల్లారావు పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటితో పాటు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు, నకిలీ ఎరువులు, పురుగుల మందులకు సంబంధించిన ఫెర్టిలైజర్స్ సంస్థల దగ్గర కమిషన్లు తీసుకుని పర్మిషన్లు ఇచ్చినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో వీటి అన్నిటిపైనా పూర్తి సమాచారం సేకరించిన జగన్ సర్కార్… నెక్స్ట్ అవకాశం ప్రత్తిపాటికి ఇస్తుందని అంటున్నారు!
అయితే… ఈఎస్ఐ స్కాం కు సంబందించి అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన క్రమంలో టీడీపీ ఎత్తుకున్న ఒకే ఒక అస్త్రం “బీసీ నేత” అని! బీసీలను అణగదొక్కేస్తున్నారని, జగన్ కు బీసీలపై గౌరవం లేదని! మరి ఇప్పుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రత్తిపాటి పుల్లారావును అరెస్ట్ చేస్తే… బాబు ఏ కార్డు తీస్తారనేది ఆసక్తికరంగా మారింది!