కొత్త అధ్యయనం: పొగతాగేవారిపై కరోనా ప్రభావం తక్కువ!

-

వినడానికి కాస్త ఆశ్చర్యంగానూ.. మరి కొంతమందికి వెటకారంగానూ అనిపించినా పొగతాగేవారిపై కరోనా ప్రభావం చాలా తక్కువంట! ఇదేదో గాసిప్పో లేక పొగాకు ఉత్పత్తుల కంపెనీలు సృషిటించిన ఫేక్ న్యూసో కాదు సుమా… సాక్ష్యాత్తు ఫ్రాన్స్ పరిశోధకులు చెబుతున్నమాట! ఏదో… బ్రహ్మం గారు చెప్పినట్లు… అని మొదలుపెట్టకుండా విషయంలోకి వెల్తే… ప్రాణాంతక కరోనా వైరస్‌ సోకకుండా.. దాని ప్రభావాన్ని తగ్గించే శక్తి పొగాకులోని నికోటిన్‌కు ఉందని చెబుతున్నారు ఫ్రాన్స్ పరిశోధకులు!

పూర్తి వివరాళ్లోకి వెళ్తే… తాజాగా కరోనా వైరస్ వ్యాప్తి కి సంబందించి ఒక కొత్తవిషయం హల్ చల్ చేస్తుంది. ఈ ప్రాణాంతక కరోనా వైరస్‌ సోకకుండా.. దాని ప్రభావాన్ని తగ్గించే శక్తి పొగాకులోని నికోటిన్‌కు ఉందని తేలిందట. పొగతాగని వారితో పోలిస్తే సిగరెట్లు తాగేవారిపై ఈ మహమ్మారి తక్కువ ప్రభావం చూపిస్తుందట. వినడానికి ఏమాత్రం నమ్మశక్యంగా లేకపోయినా ఆధారలతో సహా చెబుతాము అంటున్నారు ఫ్రాన్స్‌ పరిశోధకులు. మేజర్‌ పారిస్‌ ఆస్పత్రిలో తాము జరిపిన పరిశోధనల్లో పొగాకులోని నికోటిన్‌ కరోనా సోకకుండా అడ్డుపడుతున్న విషయం వెల్లడైందని చెబుతున్నారట.

పొగాకులోని నికోటిన్ అనే పదార్ధం కరోనా వైరస్ శరీరంలోని రక్త కణాలకు అంటకుండా సమర్థవంతంగా పనిచేస్తోందని.. తాము పరిశీలించిన గణాంకాలు దీన్నే నిరూపిస్తున్నాయని, అయితే… ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఓ నిర్ధారణకు రాకుండా, మరింత అధ్యయనం చేస్తున్నామని ఫ్రాన్స్ కు చెందిన రీసెర్చర్ల బృందం చెబుతోంది. పారిస్ లోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందుతున్న 343 మందితో పాటు, స్వల్పంగా వైరస్ లక్షణాలున్న 139 మందిని పరిశీలించగా.. వారిలో కేవలం ఐదుగురు మాత్రమే పొగతాగేవారున్నారని ఆ బృద సభ్యులు చెప్పుకొస్తున్నారు.

ఇదే క్రమంలో… కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించకుండా పొగాకులోని నికోటిన్‌ అడ్డుకునే అవకాశాలు ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందని, నికోటిన్‌ సెల్‌ రెసెప్టార్స్‌ను అంటిపెట్టుకుని ఉండటం వల్ల శరీరంలో వైరస్‌ ను ప్రవేశించకుండా అడ్డుకుంటోందని ఫ్రెంచ్‌ న్యూరోబయోలజిస్ట్‌ జీన్‌ పెర్రె చాంగెక్స్‌ చెప్పుకొస్తున్నారు. అందుకు సాక్ష్యంగా… కరోనా సోకిన ప్రతీ వెయ్యి మందిలో పొగతాగేవారు 12.6 శాతం ఉండగా… పొగతాగనివారు వారు 28 శాతంగా ఉన్నట్లు తేలిందనే విషయం చెబుతున్నారు.

ఈ అధ్యయనాల సంగతి అటుంచితే…. ఈ పరిశోధనలపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది కాబట్టి… తొందరపడి ఎవరూ చెడు అలవాట్లు చేసుకోవద్దని ఈ సందర్భంగా పలువురు సూచిస్తున్నారు.

కాగా… పొగాకు ఉత్పత్తుల వల్ల మరణాలు అధికంగా నమోదయ్యే దేశాల్లో ఫ్రాన్స్‌లో మొదటి స్థానంలో ఉంది, ఇక్కడ ఏడాదికి కనీసం 75,000 మరణాలు ధూమపానంతో ముడిపడినవే! ఇదే సమయంలో ఐరోపాలో కరోనావైరస్ దెబ్బతిన్న దేశాలలో ఫ్రాన్స్ ఒకటి! ఈ దేశంలో 21,856 మందికి పైగా మరణాలు సంభవించగా… 155,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి!

Read more RELATED
Recommended to you

Latest news