సిటీలో జీవితాలు రాత్రి వెలుగులో పగలు చీకటిలో ఉంటాయి. అవును ఆ విధంగా పండుగ వేళ రాత్రి చేదు ఉదయం తీపి అన్న విధంగా ఉండాలి కూడా ! అందుకే పండగ రాత్రి ఇంటికి చేరుకోకుండా తెల్లారేదాకా తాగి తూలుతున్న బంజారాహిల్స్ భామలను పోలీసులు పట్టుకున్నారు. వారితో పాటు ఆ బాపతు మనుషులు కొందరు చిక్కారు. అయినా కూడా ! ఎవ్వరూ ఏ విచారణకూ హాజరు కావాల్సిన పని లేదు కానీ ఎప్పటిలానే ఈ కేస్ పోలీసులు క్లోజ్ చేసి రాజకీయ ఒత్తిళ్ల కారణంగా మరో ప్రకటనకు తావివ్వకుండా మరో సారి ఆ పబ్ ను నడుపుకునేందుకు అవకాశం ఇచ్చినా ఇస్తారు అన్నది గతం చెప్పిన నిజం.. అని అంటున్నారు కొందరు. ఆఖరుగా..ఇప్పుడీ కేసులో ఎవ్వరున్నా వారి పేర్లేం బయటకు రావు?
చాలా రోజులకు మళ్లీ చీకటి సామ్రాజ్యం వార్తలు హల్చల్ చేస్తున్నాయి. బంజారాహిల్స్ లో అత్యంత ఉన్నత స్థాయికి చెందిన కుటుంబాల వ్యవహారాలు కొన్ని అత్యంత ఖరీదయిన వ్యవహారాల్లోకి ఇరుక్కుపోయిన వైనం వెలుగు చూసింది. నేరం ఎవరు చేసినా ఒక్కటే కదా! రాత్రి రెండు తరువాత తాగి తూలి రేవ్ పార్టీలు చేసుకుంటున్న ఇండస్ట్రీ గురించి ఇప్పుడేం మాట్లాడినా కోపాలు వస్తాయి కనుక ష్ గప్ చిప్ అని అంటున్నారు కొందరు.
ఇదంతా ఉద్దేశ పూర్వక ఇరికింపు అని అంటున్నారు ఇంకొందరు. ఏదేమయినప్పటికీ పేరున్న కుటుంబాలు పరువున్న కుటుంబాలు చాలా రోజులకు మళ్లీ వివాదాల్లోకి వెళ్లాయి. పోలీసులు చాలా సింపుల్ వే లో నోటీసులు ఇచ్చి పంపారు. ఈ వ్యవహారంలో తమ కొడుకు లేడు అని గల్లా జయదేవ్ అనే ఎంపీ క్లారిఫికేషన్ ఇచ్చారు. తమను ఈ చీకటిలోకి లాగవద్దని వేడుకుంటున్నారు. ఆయన లేరు సరే ఎవరున్నారు ?
ఆదివారం ఉదయం ఉత్కంఠతకు తావిచ్చిన వార్తలే వెలుగులోకి వచ్చాయి. ఎప్పటి నుంచో హద్దులు దాటి పోతున్న పబ్ కల్చర్ కు సంబంధించి విస్తుబోయే వాస్తవాలు వెలుగుచూశాయి. నిబంధనలకు విరుద్ధంగా పబ్ నడుపుతున్న నిర్వాహకులు, డ్రగ్ కల్చర్ ను కూడా తీసుకువచ్చి సినిమా ఇండస్ట్రీ పెద్దలను ఆకర్షిస్తున్నారు. ఇందులో మెగా డాటర్ ఉన్నారు. ఉన్నారు అనేందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. బంజారాహిల్స్ లో అర్ధరాత్రి దాటిన తరువాత కూడా జరుగుతున్న పార్టీలలో మరో సారి విష సంస్కృతిని వెలుగులోకి తెచ్చాయి.
గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ తో పాటు మెగా డాటర్ నిహారిక కూడా ఈ దాడుల్లో దొరికిపోయారు. ఘటనా స్థలిలో డ్రగ్స్ దొరికాయి. కొకైన్ తో పాటు అత్యంత మత్తు కలిగించే సిగిరెట్లు కూడా దొరికాయి. దీంతో వీళ్లను సమీప పోలీసు స్టేషన్ కు తరలించారు దర్యాప్తు అధికారులు. ఈ సోదాలకు వెస్ట్ జోన్ పోలీసులు, నార్త్ జోన్, సెంట్రల్ జోన్ పోలీసులు నేతృత్వం వహించారు.