CSK కు గుడ్‌ న్యూస్‌..దీపక్‌ చాహర్‌ వచ్చేశాడు !

-

చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్యాన్స్‌ కు అదిరిపోయే శుభవార్త అందింది. సీఎస్‌ కే స్టార్‌ బౌలర్‌, కమ్‌ ఆల్‌ రౌండర్‌ జట్టులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వేలంలో.. ఏకంగా రూ.14 కోట్లు పెట్టి చాహర్‌ ను తిరిగి దక్కించుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ అతడి సేవల కోసం ఎదురు చూస్తోంది.

ఈ సీజన్‌ లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ ల్లోనూ ఓడిన చెన్నై.. ఆదివారం పంజాబ్‌ తో జరిగే.. మూడో మ్యాచ్‌ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో.. ఉంది. ఈ నేపథ్యంలో దీపక్‌ చాహర్‌ నెట్‌ ప్రాక్టీస్‌ మొదలు పెట్టడం ఆ జట్టుకు సంతోషాన్ని చ్చే విషయం.

డెత్‌ ఓవర్లలో చాహర్‌ లాంటి పేసర్‌ లేని లోటు తొలి రెండు మ్యాచ్‌ ల్లో చెన్నై కి చాలా స్పష్టంగా తెలిసొచ్చింది. గత సీజన్‌ లో చెన్నై విజేతగా నిలవడంతో.. కీలక పాత్ర పోషించిన దీపక్‌ చాహర్‌.. ఇటీవల వెస్టిండీస్‌ తో టీ 20 సిరీస్‌ సందర్భంగా గాయపడ్డాడు. ఆ తర్వాత బెంగళూరులోని ఆకాడమీ లో ఫిట్‌ నెస్‌ టెస్టుల కోసం ఉన్నాడు. కాగా.. చెన్నై ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ఓడింది.

Read more RELATED
Recommended to you

Latest news