నెపొటిజంపై నేచరుల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు

-

నేచురల్ స్టార్ నాని నెపొటిజంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నెపో కిడ్స్ సినిమాలను చూస్తున్న వారే కదా నెపొటిజాన్ని ప్రోత్సహిస్తోందని అన్నారు. సోనీ లివ్ యాప్​లో సింగర్ స్మిత హోస్టు చేస్తున్న నిజం కార్యక్రమానికి రానాతో పాటు గెస్ట్​గా హాజరయ్యారు నాని. ఈ కార్యక్రమంలో స్మిత వారికి నెపొటిజం గురించి ప్రశ్నలడిగారు.

దీనిపై నాని మాట్లాడుతూ..‘‘నా మొదటి సినిమాను లక్షమంది చూశారు. రామ్‌ చరణ్‌ మొదటి సినిమా కోటి మంది చూశారు. అలా చూసిన వాళ్లు కదా నెపోటిజాన్ని ప్రోత్సహిస్తోంది..!’’ అని అన్నారు. ఇక దీనిపై రానా ‘‘తల్లిదండ్రుల వారసత్వాన్ని నిలబెట్టే బాధ్యత పిల్లలపై ఉంటుంది. వారిని మరో గొప్ప స్థాయికి తీసుకెళ్లాలి. అప్పుడే పిల్లలు విజయం సాధించినట్లు. అలా చేయకపోతే వాళ్లు అన్ని వైపుల నుంచి రకరకాల మాటలు పడాల్సి ఉంటుంది’’ అని తన అభిప్రాయాన్ని తెలిపాడు. దీనిపై వాళ్లిద్దరూ ఏం మాట్లాడారో పూర్తిగా తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు వేచిచూడాల్సిందే. ఈ షో సోనీ లివ్ యాప్​లో స్ట్రీమింగ్ అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news