పెళ్లికి ముందు నిఖిల్ లవ్ సీక్రెట్స్ బయట పెట్టిన పల్లవి..!

-

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీ డేస్ సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఆ తర్వాత స్వామిరారా, కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నిఖిల్ సిద్ధార్థ్ 2020 డిసెంబర్‌ నెలలో కేవలం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య తన ఇష్ట సఖి డాక్టర్ పల్లవిని పెళ్లాడారు.

నిఖిల్ పల్లవి ప్రేమ కథ గురించి చాలా మంది ప్రేక్షకులు ఆరాదీశారు. ఈ నేపథ్యంలో తాజాగా తమ పెళ్లికి ముందు జరిగిన పరిణామాలు, లవ్ ట్రాక్ గురించి మాట్లాడుతూ ఓపెన్ అయింది నిఖిల్ భార్య పల్లవి. తాజాగా మీడియా ముందుకు వచ్చిన ఈ కపుల్ ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ఓ బర్త్ పార్టీలో తొలిసారి మేము ఇద్దరం కలిసాము అని చెప్పారు. పల్లవి ని చూసిన వెంటనే ఆమె తెగ నచ్చేసి వెంట పడ్డాను అని నిఖిల్ అన్నారు. మొదటగా నిఖిల్ లవ్ ప్రపోజ్ చేసాడట. అయితే నిఖిల్ ఐ లవ్ యు చెప్పడం తో పల్లవి జోక్ చేస్తున్నాడేమో అని అనుకుందట.

అంతలోనే ఆ మాటను నిఖిల్ చెప్తాడు అనుకోలేదు అని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఆ తర్వాత నిఖిల్‌కి వెంటనే ఓకే చెప్పకుండా ఇంట్లో వారితో మాట్లాడి వారి పర్మిషన్ తీసుకున్న తర్వాతనే నిఖిల్ ప్రేమకు అంగీకరించాను అన్నట్లుగా పల్లవి చెప్పుకొచ్చింది. అలాగే ఇంట్లో వాళ్లతో యాక్టర్ అని చెప్పకుండా బిజినెస్ మెన్ అని చెప్పినట్లు తెలియజేసింది. పెళ్లికి ముందే నిఖిల్ నటించిన హ్యాపీడేస్, కార్తికేయ సినిమాలను మాత్రమే చూసాను అని పెళ్లి తర్వాత నిఖిల్ నటించిన అన్ని సినిమాలను బలవంతంగా కూర్చోబెట్టి చూపించాడు అని చెప్పింది. పెళ్లి తర్వాత ఇరవై రోజుల పాటు గోవాలో ఎంజాయ్ చేసామని, ప్రస్తుతం తాము ఎంతో సంతోషంగా ఉన్నాము అని పల్లవి తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Latest news