ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకాలను బ్రేకులు పడనున్నాయి. ఈ మేరకు ఎన్నికల నిబంధనలలో ఏపీ ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నడుస్తున్న అన్ని పథకాలను నిలిపివేయాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ కు నిమగడ్డ ఒక సర్క్యులర్ జారీ చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ ఉన్నఫలంగా ఆగిపోతుంది. .
అంతేకాక అమ్మఒడి పథకానికి కూడా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారుతుంది. నిజానికి సోమవారం నెల్లూరులో అమ్మ ఒడి రెండో విడత కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించాలని భావించారు. ఇప్పుడు కూడా జగన్ హాజరయ్యే కార్యక్రమానికి సంబంధించిన పనులు వేగవంతంగా సాగుతున్నాయి. అయితే తాజా ఆదేశాల ప్రకారం సీఎం జగన్ కార్యక్రమం పై ఉత్కంఠ నెలకొంది. కనీసం బడ్జెట్ కేటాయింపులు చేసినా, పథకాలు అమలు ఓటర్లను ప్రభావితం చేసినట్లేనని జారీ చేఇస్న సర్క్యులర్ లో పేర్కొన్నారు. అయితే నిమ్మగడ్డ ఆదేశాలలో రాజకీయ ఎజెండా కనిపిస్తోందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.