మునిసిపల్ ఎన్నికల మీద నిమ్మగడ్డ ఫోకస్.. పులివెందుల సహా ?

Join Our Community
follow manalokam on social media

ఏపీ మునిసిపల్ ఎన్నికల సమయాన నిమ్మగడ్డ మళ్ళీ కీలక ఆదేశాలు జారీ చేశారు. వివిధ మున్సిపాల్టీలు, కార్పోరేషన్లల్లోని సింగిల్ నామినేషన్లపై నిమ్మగడ్డ ఫోకస్ పెట్టారు. గుంటూరు, చిత్తూరు, కడప జిల్లాల్లోని ఆరు మున్సిపాల్టీల్లోని వివిధ వార్డుల్లో సింగిల్ నామినేషన్ దాఖలు కావడంపై కలెక్టర్ల నుంచి నిమ్మగడ్డ నివేదిక కోరారు. ఈ నెల 20వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు.

సీఎం సొంత నియోజకవర్దం పులివెందుల సహా రాయచోటి, మాచర్ల, పుంగనూరు, పలమనేరు,  తిరుపతి కార్పోరేషన్లల్లోని వివిధ వార్డుల్లో సింగిల్ నామినేషన్ దాఖలయ్యాయి. పులివెందుల, రాటచోటిల్లో 21 వార్డుల్లో, పుంగనూరులో 16, పలమనేరు, మాచర్లల్లో చెరో పది వార్డుల్లో సింగిల్ నామినేషన్ల దాఖలయ్యాయి. ఇవేకాక తిరుపతి కార్పోరేషన్లోని 6 డివిజన్లల్లో సింగిల్ నామినేషన్ దాఖలయిన సంగతి తెలిసిందే. కలెక్టర్ల నుంచి నివేదికలు వచ్చాక దీనికి సంబంధించి ఎస్ఈసీ తుది నిర్ణయం తీసుకోనున్నారని అంటున్నారు. 

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....